నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న జోష్ చిత్రంలో జె.డి చక్రవర్తి విలన్ గా చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వాసు వర్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక కధానాయకగా పరిచయమవుతోంది. ఇక ఈ చిత్రంలో అనూష్క ఐటం సాంగ్ చేస్తుందని, నాగార్జున, రాధ గెస్ట్ లుగా కనపడతారని రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి. అలాగే నాగచైతన్య మొదటి సినిమా అయినా చాలా బాగా చేస్తున్నాడని, అయితే అతనికి పోటీగా కార్తిక కూడా సింగిల్ టేక్ లో షాట్స్ ఓకే చేస్తోందని సమాచారం. ఇక అప్పట్లో రామ్ గోపాల్ వర్మ శివలో నెగిటివ్ షేడ్స్ తో ఎంట్రీ ఇచ్చిన జెడీ ఇందులో పూర్తి స్ధాయి విలన్ గా క్రూరంగా కనిపించనున్నాడు. శంకర్ రోబో లోనూ జెడీనే విలన్ కావటం విశేషం.