'శివ'సినిమాతో విలన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన జె.డి చక్రవర్తి తర్వాత హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసారు.ఇప్పుడు 'హోమం' సినిమాతో తెలుగులో(హిందీలో 'దర్వాజా బంద్ కరో' సినిమా డైరక్ట్ చేసాడు) దర్శకుడు గానూ అవతారం ఎత్తాడు.దాంతో ఆగక ఆయన ఇప్పుడు సంగీత దర్శకుడుగానూ ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు.'డిపార్టెడ్' ఆధారంగా తయారవుతున్న ఈ సినిమాలో జె.డి ఓ ప్రధాన పాత్రలోనూ కనిపిస్తాడు.అంటే ఈ చిత్రానికి నటుడు,సంగీత దర్శకుడు,దర్శకుడు జె.డీ నే అన్నమాట.ఇక ఎలానూ కథ,స్క్రీన్ ప్లే ఉండనే ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ఈ చిత్రం ఆడియో ప్రస్తుతం మార్కెట్ లో ఉంది.జగపతిబాబు,మమతా మోహన్ దాస్ హీరో,హీరోయిన్లు గా చేస్తున్న ఈ సినిమాలో యేయే శాఖర్ క్లిక్ అవుతాయో తెలియాలంటే రిలీజు డేట్ దాకా ఆగాల్సిందే.