జెడి దర్శకత్వంలో ఫ్లాఫ్ హీరో
హోమం, సిద్దం చిత్రాలతో తెలుగు నాట దర్శకుడుగా రంగప్రవేశం చేసిన జెడి ఇప్పుడు మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. జూన్ నెలాఖరున ప్రారంభమయ్యే ఈ చిత్రంలో నితిన్ హిరోగా చేయనున్నట్లు సమచారం. ఇందుకోసం జెడీ ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆ స్క్రిప్టు కూడా వర్మ కార్పోరేషన్ లో గతంలో వచ్చిన ఓ సినిమాకి ఫ్రీమేక్ అని వినపడుతోంది. ప్రస్తుతం నితిన్ వర్మ దర్శకత్వం లో అజ్ఞాత్ అనే చిత్రం లో హీరోగా చేస్తున్నారు. అంతేగాక పరుచూరి మురళి దర్శకత్వంలో మిర్చి అనే చిత్రం రూపొందుతోంది.
జెడి అయితే నాగచైతన్య చిత్రంలో విలన్ గా చేస్తున్నారు. హోమం,సిద్దం సినిమాలు ఫ్లాఫ్ కావటంతో జగపతిబాబు..జెడి దర్శకత్వంలో వెనకడుగువేసినట్లు చెప్పుకుంటున్నారు. అందులోనూ ఎ వెన్సడే రీమేక్ ని జెడి తెలుగులో ప్లాన్ చేద్దామనుకున్నారు. అయితే చివర నిముషంలో కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులో కి ఎంట్రీ ఇవ్వటంతో అది ప్రక్కకు వెళ్ళింది. ఇక ఇప్పటికే నితిన్ వరస ఫ్లాప్ ల్లో ఉన్నారు. జెడి ది కూడా అదే పరిస్ధితి కావటంతో ట్రేడ్ లో క్రేజ్ రావటం కష్టమని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











