గత కొద్ది రోజులుగా జె.డీ చక్రవర్తి ...ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 'రొబొ' సినిమాలో విలన్ గా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని జె.డి ఖండిస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ మీడియా వ్యక్తి ఆ దగ్గర అడిగితే నా స్నేహితులు కూడా నాకు ఈ విషయం ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అయితే శంకర్ మాత్రం విలన్ గా చెయ్యమని అడగలేదు. అయినా ఎలా ఈ రూమర్స్ పుట్టాయో అర్ధం కావటం లేదని బాంబ్ పేల్చాడు. అంటే జె.డీ..రజనీ ఫైట్ లేనట్లేనా అని అంటే నమ్మకం కుదరటం లేదా..పోనీ శంకర్ కి ఫోన్ చెయ్యమని నెంబర్ డయిల్ చేయబోయాడుట. దాంతో కన్ఫూజయిన అతను శెలవు తీసుకుని బయిటపడ్డాడుట. ఇంతకీ జె.డీ ఆ సినిమాలో చేస్తున్నట్లా ...లేదా