నితిన్ హీరోగా జెడి చక్రవర్తి దర్శకత్వంలో...

By Srikanya

అడవి చిత్రంతో రామ్ గోపాల్ వర్మ క్యాంప్ లో ప్రవేశించిన నితిన్..వర్మ క్యాంప్ లోనే కొనసాగుతున్నారు. 'హోమం', 'సిద్ధం' లతో దర్శకుడుగా మారిన నట దర్శకుడు జెడి చక్రవర్తి దర్శకత్వంలో నితిన్ నటించనున్నారు. రెండు సార్లు పోలీస్ స్టోరీలు చేసిన జెడీ ఈసారి ప్రేమకథని ఎంచుకున్నారు. సార్థక్‌ మూవీస్‌ పతాకంపై ప్రశాంత్‌ బుర్రా నిర్మిస్తారు. ఆయన మాట్లాడుతూ "మా సంస్థ ఇటీవలే 'ఫూంక్‌ 2'ని నిర్మించింది. దీన్నే తెలుగులో 'ఆవహం'గా అనువదించాం. ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. జేడీ చెప్పిక కథ ఎంతో బావుంది. దానికి నితిన్‌ అయితేనే న్యాయం చేస్తారు. సాంకేతికంగా ఉన్నత విలువలతో నిర్మిస్తాం. జూన్‌ మొదటి వారంలో చిత్రీకరణ మొదలవుతుంద"న్నారు. "మూడు దేశాల్లో జరిగే వినూత్న ప్రేమకథ ఇది. కథలో ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది. సంగీతానికి ప్రాధాన్యం ఇస్తామ"న్నారు జేడీ చక్రవర్తి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి అని చెప్పారు. వరస ప్లాపుల్లో దూసుకుపోయే నితిన్ ఈ చిత్రంతోనన్నా హిట్ కొడతాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X