చివరకు ఆ సినిమాకీ సీక్వెలా

ఇక ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ ని సంపాదించుకుంది. కాకపోతే పెద్ద బడ్జెట్ పెట్టకపోవటంతో ఉన్నంతలో సేఫ్ గా బయిటపడింది. అయితే ఈ చిత్రానికి కూడా సీక్వెల్ చేస్తారంటే నమ్మలేకున్నారు. అయితే ధైర్యం చేస్తున్నది జేడి కాబట్టి నో కామెంట్ అంటున్నారు. అయినా జేడికి ఈ సీక్వెల్స్ పిచ్చి ఏంటో అర్దం కావటంలేదంటున్నారు. అంతుకుముందు కూడా హోమంకి సీక్వెల్ గా మారణహోమం చేస్తున్నానన్నాడు.కానీ వర్కవుట్ కాలేదు. అలాగే ఎ వెడ్నస్ డే కూడా రైట్స్ దక్కితే జగపతిబాబు ని పెట్టి లాగించేస్తానంటున్నాడు.
అలాగే అబ్ తక్ చప్పన్ ఆధారంగా జె.డి రూపొందిస్తున్న సిద్దం లో జగపతి బాబు హీరోగా చేస్తున్నారు. డైరక్టర్ గా అతని వర్కింగ్ స్టైల్ నచ్చే జగపతి అతని ఎంకరేజ్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











