జెడి ఈ సారి కాపీ కొట్టే కథేంటో?

హీరోకా,నిర్మాతగా మోక్షం అని బహిరంగంగానే అనుకుంటున్నారు. ఇక మొదట జె.డి తన తరువాత సినిమా హోమం కి సీక్వెల్ అనీ అక్టోబర్ తొమ్మిది నుండి మొదలవుతుందనీ, మారణ హోమం అని పేరు పెడుతున్నానని భారీగా ప్రకటించేసాడు. అంతేగాక పాకిస్ధాన్ లో కథ జరుగుతుందని అనేసాడు. అయితే వర్మ సజెషన్ ఇచ్చాడో ఏంటో గానీ కథ,టైటిల్ మార్చాడని చెప్తున్నారు. చూద్దాం ఈ సారన్నా నిజమైన హిట్ ఇవ్వాలని కోరుకుందాం. ఇంతకీ నిర్మాత హోమం నిర్మాతే కావటం కొసమెరుపు. ఇంతకీ తనని నానారకాలుగా ఏడ్పించాడన్న మమతా మోహన్ దాస్ మళ్ళీ ఈ సారి మోక్షం కనిపిస్తుందా...చూద్దాం.
హోమం సినిమాతో కలిసిన జె.డి,జగపతిబాబు కాంబినేషన్ మరోసారి మోక్షం అంటూ రంగంలోకి దూకుతోంది. మొదటి చెప్పినట్లుగా జె.డి ఈ చిత్రాన్ని హోమం కు సీక్వెల్ గా చేస్తున్నారా లేదా అనేది తెలియటం లేదు. అలాగే అయితే ఈ సినిమాకి మారణహోమం అని పేరు పెడతారనుకున్నారు.జె.డి అట్లానే చెప్పాడు. అయితే ఆయన మనస్సు మార్చుకుని ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు కథతో వస్తున్నాడని తెలుస్తోంది. జెడి మోక్షం అనే పేరుతో ముందుకొస్తున్నారు.
ఇక ఈ సినిమాలో జగపతి బాబు అలాగే హోమం సినిమా ది డిపార్టెడ్ చిత్రానికి ఫ్రీమేక్ కావటంతో ఈ సినిమా దేనికి కాపీ అంతా ఎదురుచూస్తున్నారు.అంతేగాక అక్టోబర్ తొమ్మిదినుంచి హోమం సీక్వెల్ మారణ హోమం ప్రారంభం చేస్తానని,ఇందులో జగపతి బాబు పాకిస్ధాన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందన్నారు. అయితే ఇప్పుడు మనస్సు మార్చుకున్నాడని ఈలోగా మరో డీవీడి అతనికి నచ్చి ఉంటుందని అంటున్నారు. కోనేరు కిరణ్ కిమార్ ఈ చిత్రానికి నిర్మాత


Click it and Unblock the Notifications











