ఓ ప్రక్క ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాధ్యం నడుస్తూంటే సినీ పరిశ్రమ మాత్రం తన రిచెనెస్ ని కొద్దిగా కూడా వదలటానికి ఇష్టపడటం లేదు. తాజాగా జీవా అనే కన్నడ చిత్రంలో ఓ ఐటం సాంగ్ తీయటం కోసం నలబై వేల బీర్ బాటిల్స్ తో అబ్బాయి నాయుడు స్టూడియోస్ లో సెట్ వేసారు. దీనికి దాదాపు ముఫ్పై లక్షలు దాకా ఖర్చు అయ్యింది. కొరియాగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన ప్రభు శ్రీనివాస్ దీనిని డైరక్ట్ చేస్తున్నాడు. శ్రధ్దా శర్మ అనే ఐటం గర్ల్ ఈ సెట్ లో నర్తించింది. ఇక ఈ బాటిల్స్ ని చెన్నై నుంచి తీసుకొచ్చారు. అవి లైటింగ్ పడగానే మెరవటానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసారు.ఇక దీని గురించి ఆ నిర్మాత మాట్లాడుతూ ఇవన్నీ తెరపై పండితే తమ శ్రమ ఫలించినట్లే అంటున్నాడు.