ఆర్‌బి చౌదరి కుమారుడికి అంతర్జాతీయ అవార్డు
సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి కుమారుడు జీవాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇటీవల గ్రీస్‌లోని సైప్రస్ నగరంలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జీవా నటించిన రామ్ చిత్రాన్ని ప్రదర్శించారని, ఆ చిత్రంలో జీవా ప్రదర్శించిన నటనకుగాను ఉత్తమ నటుని అవార్డు లభించిందని, దాదాపు 45 సంవత్సరాల క్రితం శివాజీగణేశన్‌కు అంతర్జాతీయ అవార్డు లభించిందని, ఆ తర్వాత అంతర్జాతీయ అవార్డును జీవా పొందటం ఆనందంగా ఉందని పాత్రికేయుల సమావేశంలో ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్, వాకాడ అప్పారావు తెలిపారు.
తల్లి సెంటిమెంట్ ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందిందని, ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఆర్.బి.చౌదరి కుమారునికి ఈ ఆవార్డు రావటం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని పరాస్‌జైన్ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు చిత్రప్రముఖులు జీవాకు అభినందలు తెలిపారని చెప్పారాయన. జీవా హీరోగా అస్కార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన డిష్యుం డిష్యుం ఘన విజయం సాధించిందని, తాజా చిత్రం ఇ తెలుగు, తమిళ భాషల్లో జూలైలో విడుదల కానుందని వాకాడ అప్పారావు చెప్పారు.


Click it and Unblock the Notifications