Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జీవా న్యూ తెలుగు మూవీ ‘మాస్క్’
చైన్నె: తమిళ హీరో జీవా నటిస్తున్న అరవ చిత్రం 'ముగమూడి'. యూటీవీ మోషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకుడు. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జీవా సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'మాస్క్' టైటిల్ ఖరారు చేశారు.
ఆర్ బి చౌదరి ఈ చిత్ర తెలుగు అనువాద హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ఆగస్ట్ 12న హైదరాబాద్ లో ఈ చిత్ర ఆడియోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈచిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కోలీవుడ్ తెరపైకి తొలిసారిగా రానున్న హాలీవుడ్ స్టైల్ చిత్రం ముగమూడి అని ఆ చిత్ర నిర్మాణ సారధి డి.ధనుంజయన్ అంటున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను ప్రేక్షకులు తమిళ తెరపై ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరని ఆయన అంటున్నారు.
ఆ మధ్య విడుదలైన 'రంగం' చిత్రం తెలుగులో సూపర్ హిట్ కావడంతో జీవా సినిమాలకు ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ తర్వాత జీవా హీరోగా వచ్చిన వచ్చాడు గెలిచాడు, రౌద్రం, స్నేహితుడు వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. మరి ఈచిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.