twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవా న్యూ తెలుగు మూవీ ‘మాస్క్’

    By Bojja Kumar
    |

    చైన్నె: తమిళ హీరో జీవా నటిస్తున్న అరవ చిత్రం 'ముగమూడి'. యూటీవీ మోషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకుడు. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జీవా సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'మాస్క్' టైటిల్ ఖరారు చేశారు.

    ఆర్ బి చౌదరి ఈ చిత్ర తెలుగు అనువాద హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ఆగస్ట్ 12న హైదరాబాద్ లో ఈ చిత్ర ఆడియోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈచిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కోలీవుడ్ తెరపైకి తొలిసారిగా రానున్న హాలీవుడ్ స్టైల్ చిత్రం ముగమూడి అని ఆ చిత్ర నిర్మాణ సారధి డి.ధనుంజయన్ అంటున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను ప్రేక్షకులు తమిళ తెరపై ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరని ఆయన అంటున్నారు.

    ఆ మధ్య విడుదలైన 'రంగం' చిత్రం తెలుగులో సూపర్ హిట్ కావడంతో జీవా సినిమాలకు ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ తర్వాత జీవా హీరోగా వచ్చిన వచ్చాడు గెలిచాడు, రౌద్రం, స్నేహితుడు వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. మరి ఈచిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    English summary
    The Telugu title of Jeeva’s upcoming superhero film has been confirmed as Mask. Directed by Mysskin, Jeeva plays a masked vigilante in the film which is originally being made in Tamil as Mugamoodi. Pooja Hegde is playing the lead role opposite Jeeva and this is her first film in Telugu and Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X