వి.వి.వినాయిక్ చేతుల మీదగా 'మాస్క్‌'

By Srikanya

హైదరాబాద్ : జీవా హీరోగా నటించిన చిత్రం 'మాస్క్‌'. పూజా హెగ్డే హీరోయిన్ గా మిస్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆదివారం హైదరాబాద్ లో విడుదలైంది. ఎన్‌.వి.ప్రసాద్‌, పారస్‌ జైన్‌ నిర్మాతలు. ఆర్‌.బి.చౌదరి సమర్పకులు. కె సంగీతం అందించారు. తొలి సీడీని దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. హీరో సునీల్‌ స్వీకరించారు. మిస్‌కిన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆడియో విడుదల సందర్భంగా హీరో జీవా మాట్లాడుతూ ''సూపర్‌మేన్‌ తరహా పాత్రను పోషించే అవకాశం ఈ సినిమాతో నాకు దొరకడం ఆనందంగా ఉంది. పూర్తిగా మన దక్షిణ భారత వాతావరణానికి తగ్గట్టుగా సాగుతుంది. ఈ సినిమా కోసం కిలోల కొద్దీ బరువుండే దుస్తుల్ని ధరించి నటించాను. కథ, పాత్రలకు తగ్గట్టుగా కొన్ని యుద్ధ విద్యల్ని నేర్చుకొన్నాను. నటుడిగా భిన్నమైన అనుభూతిని మిగిల్చింది. దర్శకుడు మిస్కిన్‌ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. 'రంగం'లాగే ఈ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది''అన్నారు.

వినాయక్‌ మాట్లాడుతూ ''నాకు బాగా ఇష్టమైన దర్శకుల్లో మిస్కిన్‌ ఒకరు. సున్నితమైన కథాంశాల్ని చాలా బాగా తెరకెక్కిస్తారు. 'మాస్క్‌' ప్రచార చిత్రాల్ని చూడగానే సినిమాపై ఆసక్తి కలిగింది. జీవాకి ఈ సినిమాతో మరొక మంచి విజయం చేకూరాలి''అని ఆకాంక్షించారు. నిర్మాతల్లో ఒకరైన యన్.విపసాద్ మాట్లాడుతూ ''యు.టి.వి.సంస్థ మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. 'రంగం'తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీవా ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించాడు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ కార్యక్షికమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది' అన్నారు.

ఓ సాధారణ వ్యక్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సూపర్‌మేన్‌గా ఎలా అవతరించడన్న పాయింట్ తో నడిచే చిత్రం ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నడుస్తుంది. జీవా సూపర్‌హీరో పాత్రలో కనిపిస్తారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో యన్.విపసాద్-పారస్‌జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్‌.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నాజర్‌, అలీ, దేవిప్రసాద్‌, ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X