రంగం హీరో గుప్పిట్లో 400 థియేటర్లు!
రంగం హీరో జీవా, శ్రియ జంటగా గోకుల్ దర్శకత్వం వహింన ఈ చిత్రం రౌద్రం. దశావతారం, సూర్యా సన్నాఫ్ కృష్ణన్, ఐరన్ మేన్ 2, హిరానా, పారానార్మల్ యాక్టివిటీ, ఉరుమి వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఎస్ విఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా రౌద్రం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా నిర్మాత శోభ మాట్లాడుతూ "మా సంస్థలో వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'రౌద్రం'. నాగార్జునగారికి 'శివ' ఎంతటి సంచలన విజయం సాధించిందో 'రౌద్రం' కూడా జీవాగారికి పెద్ద విజయాన్ని అందిస్తుంది. గోకుల్ దర్శకత్వ ప్రతిభ మెప్పిస్తుంది. శ్రియ పాత్ర బావుంటుంది. ఆమె చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది. జీవా నటన, ఫైట్స్ కొత్తగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మలిచాం'' అని తెలిపారు. ఈ సినిమాను ముగింపును తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి చిత్రీకరించటం జరిగిందన్నారు.
ప్రకాష్‌రాజ్, జె.పి., లక్ష్మీ రామకృష్ణ, మోనిక, చైతన్యకృష్ణ, గణేష్ ఆచార్య, బాబ్ ఆంథోని తదితరులు పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: సుధాకర్ రాజశ్రీ, సంగీతం: ప్రకాష్ నిక్కీ, కెమెరా: షణ్ముగ సుందరం, ఫైట్స్: కనల్ అరసు, సమర్పణ: ఎస్.వి.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్.


Click it and Unblock the Notifications











