మద్దెలచెర్వు సూరితో మాట్లాడే 'రంగ ది దొంగ' చిత్రం
మద్దెలచెర్వు సూరిని ఓసారి అనుకోకుండా విమానాశ్రయంలో కలిశాను. అరగంటసేపు మాట్లాడుకొన్నాం. ఫ్యాక్షనిస్టుల జీవితాలు ఎలా ఉంటాయో ఆయన మాటల్లో తెలుసుకొన్నాను. అప్పటికే 'రంగ ది దొంగ' కథ సిద్ధమైంది. కానీ ఆయన మాటలు విని కథలో కొన్ని మార్పులు చేసుకొన్నాను అంటున్నారు దర్శకుడు జీవి. ఆయన తాజాగా చిత్రం 'రంగ ది దొంగ' క్రిందటి శుక్రవారం విడుదైంది. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఆ చిత్రం ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే శ్రీకాంత్ గురించి చెబుతూ.. "శ్రీకాంత్ వంద సినిమాలు చేసిన కథానాయకుడు. ఆ వంద సినిమాల్లో చూడని శ్రీకాంత్‌ని మా సినిమాలో చూపించాం. అదే ప్రేక్షకులకు నచ్చింది" అంటున్నారు. దర్శకుడిగా తన తదుపరి చిత్రం వివరాల్ని సంక్రాంతికి ప్రకటిస్తాను అన్నారు. ఇక 'రంగ ది దొంగ' చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
శ్రీకాంత్ మహాత్మా జీవీ సుధాకర్ నాయుడు కృష్ణవంశీ రంగా ది దొంగ srikanth mahatma sudhakar naidu krishna vamsi ranga the donga


Click it and Unblock the Notifications