ఝలక్ : జీవిత ప్రశ్నిస్తే...ప్రభుదేవా సమాధానం చిరంజీవి!

ఈ కార్యక్రమంలో జీవిత ప్రభుదేవాను పలు ప్రశ్నలు అడిగింది. 'మీకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నచ్చిన డాన్సర్ ఎవరు?' అని జీవిత అడిగిన ప్రశ్నకు ప్రభుదేవా స్పందిస్తూ......చిరంజీవి సర్ నా ఫేవరెట్. ఆయనంటే ఎంతో ఇష్టం' అంటూ సమాధానం ఇచ్చారు ప్రభుదేవా. ప్రభుదేవా నుండి అలాంటి సమాధానం వస్తుందని జీవిత అసలు ఊహించి ఉండదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
జీవిత రాజశేఖర్ దంపతులు - చిరంజీవి మధ్య చాలా కాలంగా విబేధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వరుస ప్రెస్ మీట్లు పెట్టిమరీ చిరంజీవిపై విమర్శలు గుప్పించారు జీవిత రాజశేఖర్. చిరంజీవి కూడా పలు సందర్భాల్లో వారిపై విమర్శలకు ప్రతి విమర్శలు చేసారు.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన పలువురిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి 150వ సినిమాలో రాజశేఖర్ నటించే అవకాశం ఉందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











