twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు, దయచేసి అలా రాయొద్దు: జీవిత

    |

    'మా' ఎన్నికల గురించి మీడియాలో రకరకాలుగా రాస్తున్నారు. రాంగ్ ఎట్మాస్పియర్ క్రియేట్ చేస్తున్నారు. అలా చేయవద్దని మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో ఫ్యానల్‌కు చిరంజీవిగారు సపోర్ట్ చేస్తున్నారని, చిరంజీవి మాటను ధిక్కరించి నరేష్ నిలబడ్డారని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని... నరేష్ ప్యానల్ తరుపున ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న జీవిత వ్యాఖ్యానించారు.

    ముందుగా అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. ఏకగ్రీవం చేద్దామనుకున్నాం. కానీ వారిలో కొందరు పోటీ చేయాలన్నారు. మేమూ చేయాలనుకుంటున్నాం. ఎవరిదీ తప్పు అని చెప్పలేం. అందుకే ఎలక్షన్ వరకు వెళ్లామని తెలిపారు.

    ఎవరు గెలిచినా చిరంజీవి గారికి అభ్యంతరం లేదు

    ఎవరు గెలిచినా చిరంజీవి గారికి అభ్యంతరం లేదు

    చిరంజీవిగారిని మేమంతా కలిశాం. ఆయన ఒకటే చెప్పారు. మనమంతా ఒక ఫ్యామిలీ, హెల్దీగా కంటెస్ట్ చేయండి అని చెప్పారు. విన్ అయి రండి. ఎవరు గెలిచినా అందరం కలిసి పని చేద్దామన్నారని... జీవిత వెల్లడించారు.

    గతంలో జరిగిన గొడవలు పట్టించుకోం

    గతంలో జరిగిన గొడవలు పట్టించుకోం

    మీడియాలో రకరకాలుగా రాస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు. లక్షల మంది చూస్తున్నారు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. గతంలో జరిగిన విషయాల గురించి పట్టించుకోం. మా ప్యానెల్‌లో చాలా మంది ఉన్నారు. ఎంత మంది సపోర్టుగా ఉంటే అంత మందినీ తీసుకుంటాం. అభివృద్ది అనేది ఒకరిద్దరితో కాదు.. అందరం కలిసి కట్టుగా చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

    అలా చేస్తే నష్టపోయేది మనమే

    అలా చేస్తే నష్టపోయేది మనమే

    నరేష్ మాట్లాడుతూ... ఈ టీమ్ ఆశామాషీగా సెలక్ట్ చేయలేదు. సెలబ్రిటీల ఫోటోలు చూసి ఓటేస్తే, ఎవరో చెప్పారని ఓటేస్తే దెబ్బతినేది మనమే. మా టీమ్ చూస్తే స్టార్ స్టేటస్ ఉన్నవారూ ఉన్నారు, మంచి యాక్టర్లు ఉన్నారు. ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లేవారు, యూత్, మహిళలు, అన్ని ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు.

    తెలంగాణ వారికి న్యాయం

    తెలంగాణ వారికి న్యాయం

    గతంలో తెలంగాణ నుంచి ఒకరు మాత్రమే ఉన్నారు. నేను చాలా బాధ పడ్డాను. అది కూడా అప్పటికప్పుడు వేసింది. మనకు రెండు రాష్ట్రాలు ఉన్నా అందరం ఒకటే. తెలంగాణ నుంచి ఆరుగురు మా ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు. అందరికీ న్యాయం జరిగేలా ప్యానల్ వేశామని నరష్ తెలిపారు.

    మార్చి 10న ఎన్నికలు

    మార్చి 10న ఎన్నికలు

    మార్చి 10న ‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శివాజీ రాజా మరోసారి అధ్యక్షుడిగా పని చేసేందుకు పోటీ చేస్తున్నారు. ఆయన ప్యానెల్‌లో శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. వీరికి చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రధాన కార్యదర్శఇగా పని చేసిన నరేష్ ఈ సారి అధక్య పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఆయన ప్యానల్ తరుపున జీవిత ప్రధాన కార్యదర్శిగా, రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. వీరికి కృష్ణ, మహేష్ బాబు ఫ్యామిలీ మద్దతు ఉన్నట్లు టాక్.

    English summary
    Actress Jeevitha about MAA election and Chiranjeevi's Reaction On Naresh Panel. On March 10, the Movie Artistes Association (MAA) will vote for its new governing body, and everyone is gearing up for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X