శాంతి చేయించాలని చెప్పారు: జీవిత
ఈ చిత్రం టైటిల్ చాలా పవర్‌ఫుల్ అనీ, శాంతి చేయించడం మంచిదని చాలామంది చెప్పారు. వారు అన్నట్టుగానే ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు రాజశేఖర్‌గారికి ప్రమాదం జరగడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఏదైనా చేసేది మంచి ప్రయత్నం కాబట్టే దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. ఇందులో కొత్త రాజశేఖర్‌ని చూస్తారు అని జీవిత అన్నారు. రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహంకాళి'. ప్రారంభమై చాలా కాలం అయినా ఇప్పటివరకూ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఆ జాప్యం ఎందుకు అయిందో ఆ విషయాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు నిర్మాతలు. సురేందర్‌రెడ్డి, ఎ.పరంధామరెడ్డి, మురళి ఎస్.ఆర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సందర్భంగా సమావేశంలో జీవిత మాట్లాడుతూ -''పలు కారణాల వల్ల 'మహంకాళి' నిర్మాణంలో జాప్యాలు జరిగాయి. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇత హీరో రాజశేఖర్ మాట్లాడుతూ...''మనసుల్ని తాకే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమానే 'మహంకాళి'. ఈ సినిమా విడుదల కోసం నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను''అన్నారు. రాజశేఖర్ పోలీస్‌గా నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్సే. ఆ వరుసలోనే ఈ సినిమా కూడా నిలుస్తుందని సమర్పకుడు వల్లభనేని అశోక్ అన్నారు. టైటిల్‌లాగే సినిమా కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన పరంధామరెడ్డి చెప్పారు. ఇంకా ప్రసన్నకుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











