ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తోంది: శివాజీ రాజా తీరుపై నటి జీవిత

Recommended Video

Jeevitha Rajasekhar Slams Shivaji Raja On His Behavior || MAA || Tollywood || Filmibeat Telugu

'మా'లో గతంలో జరిగిన విషయాలన్నీ మరిచిపోయి ఇకపై మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల్లో పోటీ చేశాము. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. కౌంటింగ్ ప్రక్రియ కూడా యూట్యూబులో పెట్టారు. అంతా పారదర్శకంగా ఉంది. గెలిచిన మా ప్యానల్ చార్జ్ తీసుకుంటేనే పనులు జరుగుతాయి. మేము చాలా సిన్సియర్‌గా పని చేద్దామని ఆఫీసుకు వస్తే... పెద్ద షాక్ తగిలింది. పంతం పట్టి మరీ మేము పని చేయకూడదు అని లాగుతున్నట్లు అనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని కొత్తగా ఎన్నికైన 'మా' జనరల్ సెక్రటరీ జీవిత వ్యాఖ్యానించారు.

పట్టుకుని వేలాడటం ఎందుకు?

పట్టుకుని వేలాడటం ఎందుకు?

నాకు పోటీ చేయాలని లేదు, కుటుంబంతో కలిసి అరుణాచలం వెళ్లిపోదామనుకున్నాను. కానీ అందరూ బలవంతం పెడితే మళ్లీ పోటీ చేశాను అని చెప్పిన శివాజీ రాజా... ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా పట్టుకుని వేలాడటం ఎందుకు? ఆయన తీరు చూసి షాకయ్యాను అని జీవిత తెలిపారు.

వాళ్ల తీరు చూస్తుంటే భయం వేస్తోంది

వాళ్ల తీరు చూస్తుంటే భయం వేస్తోంది

మేము గెలిచిన తర్వాత... నాన్ ఎలిజబిలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ చూస్తుంటే... రేపు మేము చార్జ్ తీసుకున్న తర్వాత ఇంకెన్ని సమస్యలు తీసుకొస్తారో అనే భయం మాలో మొదలైంది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ వరకు తేవడానికి కారణం కూడా ఇదే అని జీవిత అన్నారు.

మాకు గొడవలు, కుట్రలు ఇవేమీ వద్దు

మాకు గొడవలు, కుట్రలు ఇవేమీ వద్దు

మేము ఇక్కడ డ్రామా చేయడానికి రాలేదు. సిన్సియర్‌గా పని చేయడానికి వచ్చాం. మేము వర్క్ చేయడానికి మీకు ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి. మేము ఇక్కడ ఫైట్ చేయడానికి రాలేదు. మాకు గొడవలు, కుట్రలు ఇవేమీ వద్దు. దాని వల్ల నష్టమే కానీ ఎవరికీ మంచి జరుగదు. ఇప్పటికే నష్టం జరిగింది. ఇలాంటి ఎట్మాస్మియర్ ఉంటే బెటర్మెంట్ చేయాలనుకుని వచ్చిన మేము ఇంకా నష్టం చేసిన వారం అవుతామన్నారు.

ఈ పది రోజులు ఎవరు పని చేస్తారు?

ఈ పది రోజులు ఎవరు పని చేస్తారు?

మార్చి 31 వరకు మమ్మల్ని చార్జ్ తీసుకోకుండా ఆగాలంటున్నారు. ఈ పది రోజులు ఎవరు పని చేస్తారు? ఎక్స్‌పైరీ అయిపోయిన లైఫ్ ఇన్సూరెన్స్ ఫైళ్లకు ఎవరు సమాధానం చెబుతారు? ఇంకా కొన్ని చెక్కుల పేమెంట్లు పెండింగులో ఉన్నాయి... ఇవన్నీ ఎవరు సాల్వ్ చేస్తారు? ఈ పది రోజులు మేము పని చేస్తామని మీరు ముందే చెప్పి ఉంటే మేము కాదనేవారం కాదు కదా. అలాచేయకుండా ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇది జరుగకూడదు, జరిగితే కోర్టుకు వెళతాం అని ఛాలెంజ్ చేయడం ఎందుకు? అని జీవిత శివాజీ రాజాను ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X