For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసేటప్పుడు వాడు ఎక్కడికి పోయాడు? నా కూతుళ్లకు బూతులు: జీవిత రాజశేఖర్

  |

  దివంగత నటుడు ఎన్టీ రామరావు రెండో భార్య లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తోంది అంటూ...కొంతకాలంగా ఆమె అనుచరుడిగా ఉన్న కోటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం అయింది. ఫిర్యాదు చేసిన అనంతరం అతడు టీవీ ఛానల్ డిబేట్లకు వెళ్లి లక్ష్మీ పార్వతి గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. ఎన్టీ రామారావు గురించి లక్ష్మీ పార్వతి చాలా నీచంగా మాట్లాడేవారని, అందుకు తగిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ చెప్పడంతో ఎన్నికల వేళ ఇది సెన్సేషన్ ఇష్యూగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు దారులుగా రంగంలోకి దిగిన జీవిత, రాజశేఖర్ దంపతులు ఎదురు దాడి ప్రారంభించారు.

  జయప్రద, జయసుధ అందం ఉంటే లక్ష్మీ పార్వతి సీఎం అయ్యేవారు

  జయప్రద, జయసుధ అందం ఉంటే లక్ష్మీ పార్వతి సీఎం అయ్యేవారు

  ‘‘ఆ రోజుల్లో ఎన్టీ రామారావును కుటుంబ సభ్యులు ఎవరూ చూసుకోలేదు కాబట్టే ఆయన లక్ష్మీ పార్వతిని చేరదీశారు. ఆవిడ జయప్రద, జయసుధ లాగా అందంగా ఉండి ఉంటే ఎప్పుడో సీఎం అయ్యే అయ్యుండేవారు, ఆవిడ కాళ్ల వద్దకు అందరూ వెళ్లి పడుండేవారు, ఆమెలో హీరోయిన్ల మాదిరి అందం లేదు కాబట్టే ఇలా అయింది. రామారావుకు సేవలు చేసిన అర్దాంగి మీద ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం దారుణం. ఇదంతా చంద్రబాబు అండ్ కో చేయిస్తున్నారు' అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

  ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంది

  ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంది

  ‘‘ఆ సమయంలో ఎన్టీ రామారావును చూసేవారు లేరు, ఒంట్లో బాగోలేకపోతే మందులు ఇచ్చేవారు లేరు, ఆకలేస్తే అన్నంపెట్టేవారు లేరు. పని వాళ్లను పెట్టుకోవచ్చు... కానీ పని వాళ్లు వేరు, ప్రేమతో నా అనే వాళ్లు చూడటం వేరు. ఆవిడ వెళ్లి ప్రేమగా వండి పెట్టింది కాబట్టే రామారావుగారు లక్ష్మీ పార్వతిని చేరదీశారు. ఆమె ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సేవ చేశారు.'' అని జీవిత తెలిపారు.

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసేపుడు వాడు ఎక్కడికి పోయాడు?

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసేపుడు వాడు ఎక్కడికి పోయాడు?


  ‘‘లక్ష్మీ పార్వతి వయసు ఏమిటి? వాడెవడో వచ్చి ఆరోపణలు చేయడం ఏమిటి? ఇన్ని సంవత్సరాలు ఉన్న వెధవకు ఈ రోజు ఎన్నికల ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నంత సేపు వాడికి తెలియదా ఏం సినిమా తీస్తున్నారనేది? అమ్మలా భావిస్తూ ఇన్నాళ్లు ఆవిడద దగ్గర ఉన్నానని అంటున్నాడు.. అలా చెప్పుకునే వ్యక్తి అలాంటి ఆరోపణలు చేయడం నీచం.. అది నోరా? మురికి కాలువా? లక్ష్మీ పార్వతి గురించి అలా మాట్లాడటం చాలా చాలా తప్పు.'' అంటూ జీవిత ఫైర్ అయ్యారు.

  మీరు అసలు ఒక అమ్మకు పుట్టినోళ్లేనా?

  మీరు అసలు ఒక అమ్మకు పుట్టినోళ్లేనా?

  ‘‘వాడి ఆరోపణలను టీవీల్లో చూపిస్తున్న వారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను.. మీకు అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు లేరా? వాడు వెళ్లాడు.. కంప్లయింట్ చేశాడు.. అది ప్రూవ్ అయిందా? ఈ లోగా వాడిని తీసుకొచ్చి, ఛానళ్లలో కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడించడం ఏమిటి? మీరు అసలు ఒక అమ్మకు పుట్టినోళ్లేనా? ఇలాంటివి చేయడం సిగ్గు చేటు. డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు. ఇలా చేయడం అంటే మీ అమ్మనో, చెల్లో పెట్టి సంపాదించినట్లే లెక్క. ఇలాంటి సంపాదన మీడియాకు అవసరమా? చక్కగా మీడియా నడిపేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక 10 శాతం ఇలాంటి పనులు చేస్తూ మీడియా పరువు తీస్తున్నారు.'' అంటూ జీవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

  నా కూతుళ్లకు బూతు సందేశాలు పంపిస్తున్నారు

  నా కూతుళ్లకు బూతు సందేశాలు పంపిస్తున్నారు

  ‘‘నేను, రాజశేఖర్ వైసీపీలో చేరగానే నా కూతుళ్లకు ఇన్ స్టాగ్రామ్‌లో ఎవడో వచ్చి అసభ్యమైన కామెంట్స్ పెడుతున్నాడు, మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అంటూ జీవిత ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఇదంతా టీడీపీ, జనసేన వారు మనుషులను పెట్టి చేయిస్తున్నదే''. అని రాజశేఖర్ ఆరోపించారు.

  English summary
  Jeevitha and Rajasekhar support to Lakshmi Parvathi in Sexual harassment case. They said the allegations are not true. Sexual harassment case has been filed on Lakshmi Parvathi. A man identified as Koti registered a case on Lakshmi Parvathi alleging that she has been harassing him and has been approaching him inappropriately. Koti also revealed that ‘‘The truth is not shown in Lakshmis NTR movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more