Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
డ్రగ్స్ తో పట్టు బడ్డ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మరో తిమింగళం..
కొంతకాలం క్రితం డ్రగ్స్ కేసులో రవితేజ తమ్ముళ్లు రఘు, భరత్ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారంటూ అప్పట్లో సంచలనమైన వార్తలు బయటికి వచ్చాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో తాజాగా ఈ రోజు మరో పెద్ద చేప దొరికిపోయింది. తాజాగా ఈ రోజు నటి, దర్శకురాలు, హీరో రాజశేఖర్ భార్య జీవిత సోదరుడు అయిన మురళి 200 గ్రాముల కొకైన్ తో రెడ్ హేన్ డేడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో రాజశేఖర్ హీరోగా రూపొందిన 'మగాడు', 'శేషు' వంటి చిత్రాలను నిర్మించిన మురళి గత కొంతకాలంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని అంటున్నారు. ఆ క్రమంలో కొకైన్ తీసుకుని వెళుతుండగా హైదరాబాదు, జూబిలీ హిల్స్ ప్రాంతంలో మాటువేసిన వెస్ట్ జోన్ డీసీపీ బృందం మురళీని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో అతనితో బాటు చిత్రసీమకు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. మొన్నామధ్య టాలీవుడ్ ని డ్రగ్స్ ఉదంతం కుదిపేసిన సంగతి తెలిసిందే. బడా తారలు కూడా ఈ డ్రగ్స్ వలయంలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.