‘మా’ నిధులు దుర్వినియోగంపై జీవిత క్లారిటీ... ఏం జరిగిందంటే?
నరేష్ ప్రెసిడెంటుగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత తొలిసారి నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. 'మా' తరుపున చేసే కార్యక్రమాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు రూ. 7.5 లక్షలు జీవితా రాజశేఖర్ కూతురు ఖాతాలోకి మళ్లించినట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
ఈ వార్తలపై జీవిత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మేము నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయడంలేదు. ఏం జరుతుందో ఆఫీస్ బేరర్స్ అందరికీ తెలుసు. ఏమైనా అనుమానాలు ఉంటే మా ఆఫీసుకు వచ్చి చెక్ చేసుకోండని ఆమె చెబుతున్నారట.

'మా'లో అర్హులైన సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందించే అంశంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మాట్లాడామని, ఆయన హామీ ఇవ్వడంతో పథకాలను ప్రచారం చేయడానికి యాడ్స్ రూపొందించామని, 'మా' అధ్యక్షుడు నరేష్ షూటింగులో ఉండటంతో ఆ ప్రకటనలకి అయిన ఖర్చును మేము స్వయంగా పెట్టుకున్నామని, ఆ మొత్తాన్ని తిరిగి తీసుకున్నామని జీవిత చెప్పినట్లు సమాచారం.
'మా'పై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ముందే తెలుసు. అందుకే 'మా' అకౌంట్స్ విషయంలో అన్ని లెక్కులు పర్ఫెక్టుగా, పారదర్శకంగా ఉండేట్లు చూసుకుంటున్నామని జీవిత స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











