నీతూ పిర్యాదు కుట్రే:జీవిత

గత నెల 23న షూటింగ్ లో జరిగిన ఉదంతం గురించి తాము ఇదివరకే పూర్తి వివరణ ఇచ్చామన్నారు. సంఘటన యూనిట్ సభ్యులు,మేనేజర్లు అందరి ముందూ జరిగింది కనుకు ఎవరెలా ప్రవర్తించారనే నిజం బయిటపడుతుందని జీవిత అన్నారు. సినిమా నిర్మాణం చివరి ధశలో రెండు షాట్లు మాత్రమే మిగిలి ఉండగా నీతూచంద్ర అర్ధవంతంగా నిష్క్రమించారని,నచ్చచెప్పి షూటింగ్ కి తీసుకురావాలని ప్రయత్నించిన మేనేజర్లుపై దురుసుగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. తొలి నుండీ ఆమె తేదీల విషయంలోనూ,షూటింగ్ లోనూ తామూ ఇబ్బంది పడ్డామని జీవిత ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











