ఆ అమ్మాయే అలాంటిది..జీవిత వివరణ

ఆ అమ్మాయి చెప్పే వన్నీ అబద్దాలే...మమ్మల్నే ఇబ్బంది పెట్టింది. ఆమె ప్రవర్తన తెలిసే మోహన్ బాబు లాంటి నటులు కూడా ప్రక్కన పెట్టారు. ఇక ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మొదటి నుంచీ ఆమె పద్దతే అంత. మేం కాల్ షీట్స్ కి డబ్బు పే చేసాం..ఆ సమయంలో నిద్రపోతే ఎలా..ఇక అసబ్యంగా తిట్టామంటున్నారు..హెరాస్ చేసామంటున్నారు...అవన్నీ నిరాధార ఆరోపణలే అని కొట్టిపారేసింది.
ఇదంతా జీవిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సత్యమేవ జీయతే(ఖాఖీ రీమేక్) షూటింగ్ సమయంలో హీరోయిన్ నీతూ చంద్రపై రాజశేఖర్ చెయ్యి చేసుకోవటంతో వచ్చిందని సమాచారం.షూటింగ్ కి ఆలస్యంగా రావటమే కాక ఇదేంటని అడిగినందుకు రివర్సైన రాజశేఖరక్ చేసిన నిర్వాకమిది అంటున్నారు. అప్పటికే లేటుగా వచ్చిన రాజశేఖర్ అప్పటికే పదమూడు టేక్ లు వరకూ తీసుకున్నాడని..అలాగే జ్వరంతో ఉన్నామెను మేకప్ వ్యాన్ నుండి బరబరా లాక్కొచ్చారని చెప్తున్నారు. ఇదంతా నీతూ చంద్ర ముంబయి పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
అయితే లేటుగా రావటం,అతికోపం రాజశేఖర్ కి చాలా కామన్ అని పరిశ్రమలో ఎవర్ని అడిగినా చెప్తారనేది నిజం. ఇది తెలుసుకునే ఏ హీరోయిన్ కూడా ఆయనతో పనిచేయటానికి ఇష్టపడదని..అందుకే రాజశేఖర్ నాతో ఏ హీరోయిన్ చేయకుండా పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నాడని అన్నా ఎవ్వరూ స్పందించలేదు. ఇలా ఇన్న రాజశేఖరుని వైపు ఉండగా జీవిత మా ఆయనదేం తప్పులేదు అని ఎంత అంటే ఏం లాభం అని అంతా అంటున్నారు.


Click it and Unblock the Notifications











