నా మీద పెద్ద వదంతి వ్యాపించింది: జీవిత రాజశేఖర్

By Srikanya

హైదరాబాద్: "నా మీద పెద్ద వదంతి ఇండస్ట్రీలో వ్యాపించింది. 'రాజశేఖర్‌కి కథ చెప్పాలంటే జీవిత వింటారు. ఆమె సలహాలిస్తారు. అన్నిట్లోనూ వేలు పెడతారు. ఆమె చెప్పినట్లు వినాలి' అని. ఆ ప్రచారం చాలా తప్పు. ఎవరైనా సరిగ్గా చేస్తే మేమెందుకు జోక్యం చేసుకుంటాం?'' అన్నారు నటి, దర్శకురాలు జీవిత. రాజశేఖర్ హీరోగా నటించిన 'మహంకాళి' సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రానికి దర్శకురాలైన జీవిత ఆ సినిమా గురించీ, ఇతర అంశాల గురించీ మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

'మహంకాళి' సినిమాకి మొదట కార్తికేయ అనే అతను డైరెక్టర్. మేకింగ్ టైమ్‌లో అతను అసౌకర్యంగా ఫీలవుతుంటే, అతనికి మరింత ఇబ్బంది కలిగించకుండా రాజశేఖర్ మాట ప్రకారం నేను డైరెక్షన్ చేపట్టాను. బేసికల్‌గా రాజశేఖర్ కానీ, నేను కానీ ఒకర్ని బాధపెట్టడాన్ని ఇష్టపడం. కానీ జరిగేది ఒకటైతే మరొకటి ప్రచారంలోకి రావడం బాధ కలిగిస్తుంటుంది.

నిజానికి నేను నటిని కావాలని కానీ, డైరెక్టర్‌ని కావాలని కానీ అనుకోలేదు. రెండూ యాదృచ్ఛికంగానే జరిగాయి. ఇప్పుడు ప్రొడక్షన్ పనులైనా అంతే. రాజశేఖర్‌గారి తరపున చేయాలి కాబట్టి చేస్తున్నానంతే. పెద్ద డైరెక్టర్ని అయిపోయి, ఆస్కార్ తెచ్చుకోవాలనే తపన నాకు లేదు. 'శేషు' సినిమాని తీద్దామనుకున్నప్పుడు ఏ డైరెక్టర్ దగ్గరకు వెళ్లినా కథని మార్చేస్తున్నారు. మాకేమో ఒరిజినల్ బాగా నచ్చి, అలాగే తీయాలనుకున్నాం. దాంతో రాజశేఖర్ చెప్పడంతో నేను బలవంతంగా డైరెక్టర్‌ని కావాల్సి వచ్చింది.

అలాగే 'ఎవడైతే నాకేంటి' సినిమాకీ ఇస్యూ అయ్యింది. ఆ సినిమా స్క్రిప్టంతా మేమే చేశాం. రాజశేఖర్, నేను ఎప్పుడూ కలిసే ఉంటాం కాబట్టి, మేం అనుకున్నవి తర్వాత డైరెక్టర్ సముద్రతో చెప్పేటప్పుడు ఆయన అసౌకర్యంగా ఫీలయ్యేవారు. దానికి నేం చేయగలిగిందేమీ లేదు. అప్పుడు కూడా రకరకాలుగా వదంతులు పుట్టాయి. రాజశేఖర్ చేస్తున్న మరో సినిమా 'అర్జున'కి కన్మణి డైరెక్టర్. తనెంతో చక్కగా, సౌకర్యంగా చేసుకుపోతున్నాడు. ఆయన పనిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే కలగలేదు. 'మహంకాళి'కి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నేను డైరెక్టర్ కావాల్సి వచ్చింది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X