మరో విషాదంలో హీరో రాజశేఖర్: జీవిత సోదరుడు శ్రీనివాస్ మరణం, డ్రగ్స్ కేస్ తర్వాత....
Recommended Video

హీరో రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఆయన తల్లి మరణించగా, ఆ బాధ నుంచి తేరుకోకముందే, ఈ తెల్లవారుఝామున జీవిత సోదరుడు, రాజశేఖర్ బావమరిది మురళీ శ్రీనివాస్ హైదరాబాదులో కన్నుమూశారు. గతజూన్ లోనే కిడ్నీ సంబందిత సర్జరీ జరిగింది అప్పటినుంచీ ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.

వార్తల్లో కనిపించలేదు
2011 లో డ్రగ్స్ మాఫియాలో కూడా మురళీ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపించింది. 305 గ్రాముల కొకైన్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మురళీ శ్రీనివాస్ ఆ కేసు తర్వాత మళ్ళీ ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించలేదు.

జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో
ఆయన పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచుతామని, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలిపారు.

యాక్సిడెంట్ కూడా చేశాడు
కాగా, రాజశేఖర్ నటించిన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తల్లి మరణించిన బాధలో ఉన్న రాజశేఖర్, మనసు వికలమై ఓ యాక్సిడెంట్ కూడా చేశాడు.

పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం
రాజశేఖర్ నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం' శుక్రవారం విడుదల కానుంది. ఈ సమయంలో కుటుంబంలో విషాదం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











