జీవితకు స్టే మంజూరు

క్రిమినల్ కేసును, మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ జీవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి విచారణ చేపట్టారు. మరొకరికి పూచీగా ఇచ్చిన చెక్కు ఫిర్యాదికి ఎలా అందిందో తెలియదని పిటిషనర్ తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. కోర్టుకు హాజరుకావడానికి జీవితకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే సినిమాతోపాటు రాజకీయ కార్యకలాపాలతో తీరిక లేదని వెల్లడించారు. అందువల్ల కోర్టు హాజరుకు మినహాయింపుతోపాటు క్రిమినల్ కేసు విచారణను నిలిపివేయాలని అభ్యర్థించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. క్రిమినల్ కేసు విచారణపై, ప్రొద్దుటూరు కోర్టుకు హాజరు కావాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై స్టే మంజూరు చేశారు.
movies telugu jeevitha rajasekhar high court nagaraju swarup reddy జీవితా రాజశేఖర్ ప్రొద్దుటూరు నాగరాజు


Click it and Unblock the Notifications