twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితకు స్టే మంజూరు

    By Staff
    |

    Jeevitha Rajasekhar
    సినీనటి జీవితా రాజశేఖర్‌పై చెల్లని చెక్కు కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ నెల 28న కోర్టుకు హాజరుకావాలంటూ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వుల అమలును కూడా నిలిపివేసింది. జీవిత తనకు రూ.10 లక్షలు బాకీ ఉన్నారని, అయితే చెల్లని చెక్కును ఆమె ఇచ్చారంటూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కె.నాగరాజు అనే వ్యక్తి స్థానిక కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన మేజిస్ట్రేట్‌ జీవితకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు. వీటిని వెనక్కు తీసుకోవాలంటూ ఆమె ఆ కోర్టును కోరారు. ఈ నెల 28న హాజరుకావాలన్న షరతుతో ఆ వారెంట్లను మేజిస్ట్రేట్‌ ఉపసంహరించారు.

    క్రిమినల్‌ కేసును, మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ జీవిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ పి.స్వరూప్‌రెడ్డి విచారణ చేపట్టారు. మరొకరికి పూచీగా ఇచ్చిన చెక్కు ఫిర్యాదికి ఎలా అందిందో తెలియదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. కోర్టుకు హాజరుకావడానికి జీవితకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే సినిమాతోపాటు రాజకీయ కార్యకలాపాలతో తీరిక లేదని వెల్లడించారు. అందువల్ల కోర్టు హాజరుకు మినహాయింపుతోపాటు క్రిమినల్‌ కేసు విచారణను నిలిపివేయాలని అభ్యర్థించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. క్రిమినల్‌ కేసు విచారణపై, ప్రొద్దుటూరు కోర్టుకు హాజరు కావాలన్న మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులపై స్టే మంజూరు చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X