twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బేధాభిప్రాయాలు తలెత్తాయి.. పరిష్కరించుకోలేకపోయాం.. మా వివాదంపై జీవిత క్లారిటీ

    |

    Recommended Video

    Jeevitha Rajasekhar Explaining About MAA Meeting

    తెలుగు సినిమా నటీనటుల సంఘం (మా) జనరల్‌ ఆత్మీయ సమావేశం నిర్మాతలమండలి హాలులో అక్టోబర్ 20వ తేదీ ఆదివారంనాడు జరిగింది. దీనిపై పలు మాధ్యమాల్లో రకరకాలుగా వార్తలు వచ్చాయి. సీనియర్‌ నరేశ్‌ అధ్యక్షుడిగా, డా. రాజశేఖర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జనరల్‌ కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ 'మా' బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా వుండగా 'మా' సమావేశానికి సంబంధించిన వివరాలను జీవిత రాజశేఖర్‌ సోమవారంనాడు వివరణ ఇచ్చారు.

    ఆదివారం జరిగిన సమావేశంలో

    ఆదివారం జరిగిన సమావేశంలో

    ఆదివారంనాడు జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళం, 'మా' సమావేశం ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. వారందకిరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదివారంనాడు జరిగిన సమావేశ వివరాలను 'మా' కార్యవర్గం ఆమోదం మేరకు తెలియజేస్తున్నా. అయితేకొందరు సభ్యులు రాలేకపోయారు. అందుకే వారికి ఆరోజు ఏం జరిగిందనేది తెలియాల్సిన అవసరం వుంది అని జీవిత తెలిపారు.

    కొన్ని భేదాభిప్రాయాలు

    కొన్ని భేదాభిప్రాయాలు

    ''ఆదివారం 9గంటలనుంచి సాయత్రం 5.30 గంటలవరకు నిర్విఘ్నంగా సమావేశం జరిగింది. ముఖ్యంగా 28మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం సాల్వ్‌ చేసుకోలేకపోయాం. దానికి కొన్ని కారణాలూవున్నాయి. ఈ క్రమంలో వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఏదిఏమైనా ఉపయోకరమైన సమావేశం అని గట్టిగా చెప్పగలను. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా 'ఎక్స్‌ట్రాడ్‌నరీ జనరల్‌బాడీ మీటింగ్‌' పెట్టుకోవాలని సూచనలు చేశారు. దానికి సంబంధించిన బైలా ప్రకారం ఏం చేయాలనేది పరిశీలించాం అని జీవిత పేర్కొన్నారు.

    జనరల్ బాడీ మీటింగ్

    జనరల్ బాడీ మీటింగ్

    మా సమావేశంలో 'మా' లాయర్‌ గోకుల్‌గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్‌గారు కూడా వున్నారు. అందరూ కలిసి ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ మీటింగ్‌ జరగాలని అనుకోవడం జరిగింది. 'మా' సభ్యుల్లో 900పైగా వున్నారు. అందులో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ జరుగుతుంది. అప్పుడే 'మా' సమస్యలు పరిక్షరించుకోవడానికి అవకాశం వుంటుంది. 20శాతం సభ్యులు ఆమోదం తెలిపితే అప్పటినుంచి 21రోజుల్లోగా మీటింగ్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది అని జీవిత వెల్లడించారు.

    తగిన చర్యలు కోసం

    తగిన చర్యలు కోసం

    మాలో ఇలా మీటింగ్‌ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. కనుక సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ 'మా' ఆఫీసుకు రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్‌ద్వారానో, పోస్ట్‌ ద్వారానో, ఆఫీసుకువచ్చేవీలున్నవారు వచ్చి సంతకాలతో ఆమోదం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను' జీవిత రాజశేఖర్‌ తెలిపారు.

    English summary
    Once again contraversy took place in MAA. Hero Rajasekhar group is getting ready for action against President VK Naresh. Members of majority Maa are ready to give show cause to VK Naresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X