డ్రగ్స్, లేడీ ఆర్టిస్ట్(శ్రీరెడ్డి) ఇష్యూలో మమ్మల్ని కూడా రోడ్డు మీదకు లాగారు: జీవిత
'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆల్రెడీ అధికారంలో ఉన్న శివాజీ రాజా ప్యానల్ మరోసారి పదవి దక్కించుకోవడానికి, ఈసారి ఎలాగైనా అధ్యక్ష పీఠం దక్కించుకోవడానికి నరేష్ ప్యానల్ తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.
నరేష్ ప్యానల్ తరుపున ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న నటి జీవిత... గతంలో పదవిలో ఉన్నవారిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సినిమా వాళ్లు అంటే నీచంగా చూసే స్థాయికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

మమ్మల్ని కూడా రోడ్డు మీదకు లాగారు
నేను, రాజశేఖర్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అనేది దాని ఉనికే తెలియకుండా ఉంది. డ్రగ్ ఇష్యూ, ఒక లేడీ ఆర్టిస్ట్(శ్రీరెడ్డి) ఇష్యూలో మమ్మల్ని అందరినీ ఇన్వాల్ చేశారు. అందరినీ రోడ్డు మీదకు లాగారు... అని జీవిత తెలిపారు.

నీచంగా చూసే పరిస్థితికి తెచ్చారు
‘మా'లో ఏమైనా గొడవలు జరిగితే మేము పరిష్కరించుకోగలుగుతాం. మేమంతా ఒక ఫ్యామిలీ. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్ అంటే సొసైటీలో చాలా చీప్‌గా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి అలా జరుగకూడదు. ఎందుకంటే నెక్ట్స్ జనరేషన్స్ వస్తున్నాయి. నా కూతుళ్లు యాక్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు కూడా ఈ ప్రొఫెషన్లోకి వస్తున్నారని జీవిత చెప్పుకొచ్చారు.

నేనైతే ఊరుకోను, ఎదురిస్తాను
ఏ విధంగా ఈ ప్రొఫెషన్ తక్కువైంది. ఇతర ప్రొఫెషన్ల మాదిరిగానే మా ప్రొఫెషన్ గౌరవించే విధంగా ఉండాలి. సినిమా వాళ్లు అని చీప్‌గా చూసే పరిస్థితికి ఇక ఉండొద్దు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అంటే గర్వంగా చెప్పుకునేలా చేయాలని నాకు ఉంది. ‘సినిమా వాళ్లు' అని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఎప్పుడు ఎవరు అలా మాట్లాడినా ఎదురిస్తాను, మాట్లాడతాను.

మనల్ని మాట అనే అవకాశం ఎందుకు ఇవ్వాలి?
‘మా'కు ఒక వాయిస్ అంటూ లేకుండా పోయింది. మనం స్ట్రాంగ్‌గా ఉంటే ఎదుటి వారికి అనే అవకాశం ఉండదు. మనం సైలెంటుగా ఉంటే ఎదుటివారు ఏమన్నా పడుతూనే ఉండాల్సి ఉంటుంది. వారికి ఎందుకు ఆ అవకాశం ఇవ్వాలి? ఆర్టిస్టుగా పుట్టడం అనేది ఒక వరం.

వాళ్లు ఏం చేశారో మనమంతా చూశాం
చిరంజీవిగారిని కలిసినపుడు ఆయనకు అన్నీ వివరించాం. ‘మా'లోపల ఏం జరుగుతోంది, ఏకగ్రీవం అవ్వాల్సిన చోట ఎందుకు ఎన్నికలకు రావాల్సి వచ్చిందో చెప్పాం. మాకు పోటీగా కంటెస్ట్ చేస్తున్నవారు ఒక టర్మ్ చేసి ఉన్నారు. వాళ్లు ఇప్పటి వరకు ఏం చేశారో చూశాం. ఈ సారి మమ్మల్ని గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపెడతాం. ఆ ధైర్యంతోనే మేనిఫెస్టో మీడియా ముఖంగా విడుదల చేశాం. మమ్మల్ని గెలిపించిన తర్వాత చెప్పిన పనులు చేయకపోతే నిలదీసి ప్రశ్నించండి... అని జీవిత తెలిపారు.


Click it and Unblock the Notifications











