రూ. 10 లక్షల విరాళం అందించిన జీవిత-రాజశేఖర్ దంపతులు!
తిత్లి తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రలోని శ్రీకాకులం, ఇతర తీరప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు సినీ సెల్రబిటీలు, ప్రజలు తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు సినీ స్టార్లు భారీగా విరాళాలు అందించగా తాజాగా ఈ లిస్టులో జీవిత-రాజశేఖర్ దంపతులు చేశారు.
మంగళవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుడితో భేటీ అయిన ఈ దంపతులు తిత్లీ తుఫాన్ రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు విరాళం అందించారు. ఈ సందర్భంగా వారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.

తిత్లి తుఫాన్ బాధితుల కోసం ఇప్పటికే బాలయ్య రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ. 20 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, వరుణ్ తేజ్ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం అందించిన సంగతి తెలిసిందే. ఇతర స్టార్స్ కూడా తమ వంతుగా విరాళం అందజేశారు.
రాజశేఖర్ సినిమాల విషయానికొస్తే... 'పిఎస్‌వి గరుడవేగ' తర్వాత ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. 'కల్కి' అనే మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరో వైపు రాజశేఖర్ కూతురు శివానీ '2 స్టేట్స్' అనే హిందీ మూవీ రిమేక్ ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది.


Click it and Unblock the Notifications











