twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజశేఖర్‌కు అమ్మాయిల సప్లైపై.. జీవిత ఫైర్.. ‘మహాన్యూస్ దగా ఛానెల్’.. లేఖ రిలీజ్

    By Rajababu
    |

    Recommended Video

    Jeevitha Rajasekhar Clarifies On Pow Sandhya Words

    సినీనటులు జీవిత, రాజశేఖర్‌పై సామాజిక కార్యకర్త, పీవోడబ్ల్యూ నేత సంధ్య చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం రేపాయి. తన భర్త రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను పంపేదని సంధ్య మహాన్యూస్ ఛానెల్‌లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సినీ, మీడియా వర్గాల్లోనూ దుమారం రేపాయి. సంధ్య వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో వాటిపై సినీ నటులు జీవిత, రాజశేఖర్ స్పందించారు. సదరు టీవీ ఛానెల్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహా న్యూస్ ఛానెల్‌పై, సంధ్య చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ జీవిత, రాజశేఖర్ బహిరంగ లేఖను విడుదల చేశారు.

    మహా న్యూస్ దగా ఛానెల్

    మహా న్యూస్ దగా ఛానెల్

    రేటింగ్సే పరమావధిగా తమ ఎదుగుదల కోసం ఎవరిపైనా బురద చల్లడానికి వెనుకాడని ఘనత వహించిన ‘మహా న్యూస్' అనే దగా న్యూస్ ఛానెల్ మా మీద ఈ నెల 14వ తేదీన ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

    సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు

    సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు

    తానొక మహిళను అని మరిచిపోయిన ఓ నాయకురాలు ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నా మీద, మా కుటుంబం మీద ఆరోపణలు చేసింది. నా వ్యక్తిగత, కుటుంబ పరువు, ప్రతిష్ఠలు దిగజార్చే విధంగా మాట్లాడిన విషయం అందరి దృష్టికి వచ్చింది.

     మా సమాధానం ఇదే..

    మా సమాధానం ఇదే..

    సదరు నేత మాపై ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యాధారాలు ఏమిటని టెలివిజన్ ఛానెల్ యాజమాన్యం ప్రశ్నించకుండా ఉండటం చాలా దారుణం. నిరాధారమైన ఆరోపణలను ప్రజలను నమ్మించే విధంగా ప్రవర్తించిన మహా న్యూస్ హోస్ట్ మూర్తి గారికి, పీవోడబ్ల్యూ సంధ్యకు ఇదే నా సమాధానం.

    చేతిలో ఛానెల్ ఉంది కదా..

    చేతిలో ఛానెల్ ఉంది కదా..

    ఛానెల్ చేతిలో ఉంది కాదా అని ఏమైనా మాట్లాడగలం అని అనుకోవద్దు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద నేను తీసుకోనే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండండి అని జీవితా రాజశేఖర్ హెచ్చరించారు.

    ప్లాన్ ప్రకారమే ఆరోపణలు

    ప్లాన్ ప్రకారమే ఆరోపణలు

    మాపై ఇలాంటి నిరాధారమైన వచ్చే వార్తలను నమ్మవద్దు. సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్‌ అంశంపై ఏర్పాటు చేసే కమిటీలో సభ్యురాలిగా ఉండబోతున్నందుకు అడ్డుపడటానికి చేసే ప్రయత్నం ఇది. వారికి ఏదో అన్యాయం జరుగబోతుంది అని భావించి కొందరు ప్లాన్ ప్రకారం ఆడుతున్న నాటకమని ప్రజలు గ్రహించాలని మనవి చేస్తున్నాం అని జీవిత అన్నారు.

    అసత్యాలు పలుకుతున్నారు..

    అసత్యాలు పలుకుతున్నారు..

    కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఓ గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్న నాపై ఇలాంటి సీ గ్రేడ్ న్యూస్ ఛానెళ్లు అసత్య ప్రచారం చేయడం శోచనీయం. పబ్లిసిటీ కోసం టీవీలో కనిపించి కొందరు అసత్యాలు పలుకుతున్నారు. వారు చేసే అసత్య ప్రచారాలకు అదే ఛానెళ్లలో మాకు సమాధానం చెప్పడం ఇష్టం లేదు. అందుకే బహిరంగ ప్రకటన జారీ చేస్తున్నాం.

     ఆరోపణలు నిరాధారం

    ఆరోపణలు నిరాధారం

    ఒక మహిళగా నేను ఏనాడు సాటి ఆడదానికి అన్యాయం చేయలేదు. మాపై కొందరు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అవన్నీ నిరాధారం. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే టీవీ ఛానెల్‌ను ప్రజలు బహిష్కరించాలని కోరుకొంటున్నాం అని జీవిత, రాజశేఖర్ సంయుక్తంగా ఓ లేఖను విడుదల చేశారు.

    English summary
    Jeevitha Rajasekhar responded on PoW Sandhya and Maha News Channel. They condemn the Sandhya allegations made on Them. Jeevitha Rajasekhar said that.. allegations made on us are baseless. We will take it seriously. This absolutely conspiracy against the fame and popularity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X