నీ కూతురు.. భర్త రొమాన్స్ చేయడం లేదా? ఎగతాలిపై భగ్గుమన్న జీవిత
Recommended Video
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, జీవిత రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. సినిమాలో అసభ్య సన్నివేశాలపై ఫైర్ అయ్యారు. ఆమె ఏమన్నారంటే..

దర్శకత్వంలో జోక్యం చేసుకోలేదని
కల్కి సినిమాకు సంబంధించిన దర్శకత్వ శాఖలో నేను జోక్యం చేసుకోలేదు. కాకపోతే నిర్మాతగా కంటెంట్, ఇతర అంశాలపై కేర్ తీసుకొన్నాను. కల్కి సినిమాను రూ.22 కోట్లతో తెరకెక్కించాం. అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నప్పుడు నాకు కొంత సినిమాపై ఇంట్రెస్ట్ ఉంటుంది. గత 30 ఏళ్లుగా నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా నాకు అనుభవం ఉంది. నేను నిర్మించే సినిమా విషయంలో బాధ్యతగా ఉండాలి కాబట్టి అన్ని విభాగాల పనితీరును పరిశీలిస్తాను అని జీవిత అన్నారు.

డైరెక్షన్ చేయమని సూచించారు
సినిమా కథను ప్రశాంత్ వర్మ చెప్పినప్పుడు నన్నే డైరెక్షన్ చేయమని రాజశేఖర్ సూచించాడు. కానీ నాకు డైరెక్షన్ చేయడం ఇష్టం లేదు. ప్రస్తుతం నా పిల్లల గురించి, ఇంటి విషయాలను చూసుకొంటూ నేను సాధారణ గృహిణి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ నాకు సినిమాను డైరెక్ట్ చేయాలంటే చేసే దానిని. ప్రస్తుతం నేను ఆ పని చేయదలుచుకోలేదు. కేవలం నిర్మాణ వరకే పరిమితమయ్యాను అని జీవిత చెప్పారు.

డిగ్రీ కాలేజ్ వివాదంపై జీవిత రాజశేఖర్
ప్రతీ విషయాన్ని వివాదంగా మలిచే పద్దతిని మానుకోవాలి. ఇటీవల ‘డిగ్రీ కాలేజీ' సినిమా ప్రెస్‌మీట్‌లో టీజర్ అశ్లీలంగా, అసభ్యకరంగా ఉందని నా అభిప్రాయం చెప్పా. దానిని కూడా మీడియాలో హైలెట్ చేశారు. నేను సెన్సార్ బోర్డులో ఉన్నాను కాబట్టి.. కొన్ని సినిమాలు చూడలేకపోతున్నాను. కంపల్సరీగా రొమాన్స్‌ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే రొమాన్స్ అవసరమో అక్కడే చూపించాలి అపి జీవిత అభిప్రాయపడ్డారు.

నేను రొమాన్స్ సీన్లలో నటించాను
గతంలో నేనూ నటించా. మా కూతుళ్లూ నటిస్తున్నారు. ఒక ముద్దు సీనో. లేదా కౌగిలి సన్నివేశం కథ డిమాండ్ మేరకే ఉండాలి. మణిరత్నంగా, బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు, బాపుగారి సినిమాల్లో రొమాన్స్ ఉంటుంది. వారు చూపించేది ఎక్కడా ఎబ్బెట్టుగా ఉండదు. సెన్సార్ సభ్యురాలిగా ఆర్‌సీ (రివైజింగ్ కమిటీ) నా దగ్గరకు వచ్చిన కొన్ని సినిమాలు చూస్తుంటే... ఏడవాలో నవ్వాలో తెలియదు అని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడు చేపల కథ మూవీపై ఫైర్
ఇటీవల ఏడుచేపల కథ అనే సినిమా చూశాను. ఆ సినిమాలో అనవసరమైన, మితి మీరిన రొమాన్స్ జొప్పించారు. దానిపై అభిప్రాయం చెబితే జీవితగారు తన పాత సినిమాల్లో చేయలేదా? రేపు ఆమె కుమార్తెలు ఎవర్నీ ముట్టుకోరా? రాజశేఖర్‌గారు ఎవరితోనూ రొమాన్స్ చేయలేదా? దీర్ఘాలు తీశారు. రొమాన్స్, లవ్ సీన్స్ సినిమాలో ఉండాలి. కానీ బలవంతంగా అలాంటివి చూపించకూడదనేది నా అభిప్రాయం అని జీవిత పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











