ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత చిరంజీవే.. భర్తపై జీవిత షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్‌లకు అప్పట్లో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మెగాఅభిమానుల రాజశేఖర్‌పై ఎంతగా విరుచుకపడ్డారో అందరికీ తెలిసిందే. సినిమా వాళ్ల మధ్య ఆ గొడవలనేవి వస్తుంటాయి.. పోతుంటాయి.. అది వేరే విషయం. మళ్లీ ఎప్పటిలానే కలిసిపోతుంటారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు..
అదేవిధంగా వీరిద్దరు కలిసిపోయారు. ఇరువురు ప్రైవేట్ పార్టీల్లో కలుస్తుంటారు. తన కూతురుకు మెడిసిన్ సీట్ కావాలంటే.. చిరంజీవే ఇప్పించారంటూ చాలా సందర్భాల్లో రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. అయితే రాజశేఖర్‌కు ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్లే శత్రువులు ఎక్కువగా ఉంటారని, అయితే ఆయన మాత్రం అవన్నీ మనుసులో పెట్టుకోరంటూ ఇటీవలె తన భర్త గురించి జీవిత ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ క్రమంలో చిరంజీవి విషయంలో జరిగిన సంఘటనను చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్..
తన భర్త చాలా ఓపెన్ హార్ట్ తో ఉంటారని చెప్పుకొచ్చారు. రాజశేఖర్, చిరంజీవి వద్దకు వెళ్లి 'గరుడవేగ' చిత్రాన్ని చూడాలని కోరగా, అప్పుడు తమ హీరోను తిట్టిన రాజశేఖర్, ఇప్పుడు వెళ్లి సినిమాను చూడటం ఏంటని, సినిమా మరింత కలెక్షన్లు సాధించాలనే ఇలా చేశారనిసోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారని మా పిల్లలు చెప్పారు. అయితే, చిరంజీవితో తమ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన్ను చాలా ఫంక్షన్లలో కలుస్తామని, బాగా మాట్లాడుకుంటామని అన్నారు.

అవి ఆవేదనను కలిగించాయి..
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తరువాత ఆ స్థాయిని సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవేనని.. 'గరుడవేగ' చిత్రాన్ని చూసి తన అభిప్రాయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆయన్ను కలిశామని అన్నారు. , వెబ్ సైట్లలో రాసిన రాతలను ఎవరమూ పట్టించుకోలేదని చెప్పారు. అయితే, అంతకుముందు తమ గురించి రాసిన వార్తలు ఆవేదనను కలిగించాయన్నారు.

భర్తను ఫ్రాడ్..
తలంబ్రాలు సినిమాలో తనను మోసం చేసే పాత్రలో రాజశేఖర్ నటించడంతో అతన్నీ ఫ్రాడ్ అని పిలుచేదాన్ని. అయితే ఒకానొక సందర్భంలో మా అత్త గారు కోప్పడటంతో బంగారం అని పిలుస్తున్నానని తెలిపింది.


Click it and Unblock the Notifications











