మరోసారి నోరుజారిన జీవిత రాజశేఖర్!

By Sindhu

ఓ పక్క కెసిఆర్ తెలంగాణఆ కోసం దీక్షలు పూని సంచనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరోపక్క ఎవరో ఒకరు ఈ తెలంగాణీయులపై విమర్శలు చేసి తమ వాటాగా కొంత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. ఇదే ఖాతాలోకి చేరిన మరో పేరు జీవిత. అసలు విషయానికొస్తే నిన్న(డిసెంబర్ 2న) ఫైవ్ ఫింగర్స్ ఎంటర్ టైన్ మెంట్ అనే ఓ కొత్త సంస్థ మంచి రోజు కదా అని తమ బేనర్ లోగోని ఆవిష్కరించేందుకు జీవితని ఆహ్వానించారు. సంతోషంగా అక్కడకు విచ్చేసిన జీవిత షరామాములుగానే నోరు జారింది. ఈ కొత్త నిర్మాతా అన్న ఓ మాటకు తెలంగాణా వారి ప్రస్తావన తెచ్చి ప్రాంతీయ వాదం గురించి తన శైలిలో దుమ్మురేపింది.

తన బేనర్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకునే ప్రాసెస్ లో అతను 'తప్పక మీడియా సపోర్ట్ చెయ్యాలి" అన్నదాన్ని కొంచెం డిమాండ్ చేసినట్టు అడిగాడు. అంతకు ముందు స్పీకర్ అందుకున్నప్పటికీ మళ్ళీ ఈ మాటతో 'ఇతని మాటలను మీడియా నెగెటీవ్ గా తీసుకోకండి. తెలంగాణావాళ్ళు ఏదైనా డిమాండ్ చేసినట్టుగా అడుగుతారు. అదే ఇతనికి వచ్చింది. అంతే కానీ మరో ఉద్దేశ్యం కాదు" అంటూ ముక్తాయించిందీ. అయితే ఈ తెలంగాణా వారి ప్రస్తావనను జీవిత అంతగా చెప్పాల్పిన సందర్భం కానప్పటికీ ఎందుకు చెప్పింది అనేది మీడియాలో చర్చనీయాంశం అయ్యింది కావాలనే సంచలనం కోసమే వార్తల్లో ఏదో ఒక విధంగా నిలవాలన్నదే ఆమె అభిమతమై అలా చేసి ఉండవచ్చనే వారు ఉన్నారు. ఏదేమైనా ఈ నోరు జారుడుతనాన్ని క్యాచ్ చేసి క్యాష్ చేసుకోవాలని కొన్ని ఛానళ్ళు ఇప్పటికే ఫ్లాన్ చేసుకుంటున్నట్టు మీడియా వారి సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X