ప్రాణాలు ఇస్తానన్నావు.. ఎందుకు పారిపోయావు.. నరేష్‌పై విరుచుకుపడ్డ జీవిత
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు వీకే నరేష్‌పై జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, జయలక్ష్మీ, హేమ విరుచుకుపడ్డారు. ఫ్రెండ్లీ సమావేశానికి గైర్హాజరు కావడంపై నిలదీశారు. తాజాగా వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ముగ్గురు మా ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ..

సమస్యలను చెప్పడానికే
మెజారిటీ సభ్యుల అంగీకారంతో ఏజీఎం పెట్టిన తర్వాత నోటీసులు ఆపమంటే ఎలా కుదురుంది. అందరికీ సమాచారం వెళ్లిన తర్వాత సమావేశం ఆపడం సమంజసమా? అనేక సమస్యలను చెప్పడానికి, పరిష్కరించాడనికి సభ్యులందరం కలువాలని అనుకొంటున్నాం. మీరు చేస్తున్న ప్రతీ పనికి చేతులు కట్టుకొని ఒకే అనాలా? అలాంటి పరిస్థితులు మాకు వద్దు అని అనుకొన్నాం అని జీవితా రాజశేఖర్ తెలిపారు.

మీడియాలో గందరగోళం
మా సమావేశాన్ని అడ్డుకోవడానికి అధ్యక్షుడు వీకే నరేష్ నానా రకాలుగా ప్రయత్నించారు. మీడియాలో బ్రేకింగ్‌లు, వాట్సప్‌లో ప్రచారారాలు ఇలా ఎన్నో చర్యలు తీసుకొన్నారు. ఇంత జరిగిన తర్వాత ఆ సమావేశం ఎందుకు జరిగిందో తెలుసా అంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. మా సంఘానికి ఎలాంటి చెడు జరిగినా.. లేదా భంగం కలిగినా ప్రాణాలిస్తామని చెప్పిన నరేస్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు అని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు.

ఎందుకు పారిపోయారని
మేము నిర్వహిస్తున్న సమావేశం తప్పనిపించినప్పుడు.. మీ వెనుక ఉండి నడిపిస్తున్న పెద్దలను తీసుకువచ్చి మమ్మల్ని ఎందుకు నిలదీయలేదు. మీ తప్పు లేకపోతే ఎందుకు పారిపోతున్నారు. అంతేకాకుండా నరేష్ మనుషులు చేసిన అల్లరితో పరుచూరి గోపాలకృష్ణ సమావేశం బయటకు వెళ్లారు. అంతేగానీ ఈసీ మీటింగ్‌లో గొడవల వల్ల కాదు అని జీవితా రాజశేఖర్ వెల్లడించారు.

సభ్యులే సమాధానం చెబుతారని
ఇక మా ఏజీఎంకు వచ్చిన సభ్యుల లెక్క గురించి అధ్యక్షుడు నరేష్ ఒక్కొసారి ఒక మాట్లాడటంపై జీవిత ఎద్దేవా చేశారు. ఒకసారి 60 మంది అని, మరోసారి 500 మంది అని నరేష్ మీడియా సమావేశంలో పొంతన లేకుండా మాట్లాడారు. 60 మంది వచ్చారా? 500 మంది వచ్చారా అనేది ఆయనే చెప్పాలి. అలాగే వచ్చిన వాళ్లందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలేకుండా కూర్చొన్నారనే విమర్శకు సభ్యులే సమాధానం చెబుతారని జీవిత పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











