రాజశేఖర్ నా గురించి అలా ప్లాన్ చేశారు.. కానీ చివరకు ఏం జరిగిందంటే! ఆసక్తికర విషయం చెప్పిన జీవిత
సినీ తారలకు సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇంతవరకు తెలియని కొన్ని విషయాలు స్వయంగా వారే చెబితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అది కూడా హీరోహీరోయిన్లుగా ఉండి నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన వారి సంగతులు మహా ఆసక్తి కలిగిస్తుంటాయి. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ చెప్పిన సంగతులు ఇంతకు రెట్టింపు ఆసక్తిని కలిగించాయి.
'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు నటి, రాజశేఖర్ సతీమణి జీవిత. ఈ సందర్బంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇందులో భాగం గానే రాజశేఖర్‌తో తొలి పరిచయం గురించి కూడా మాట్లాడారు. తమిళంలో తాను చేసిన తొలి సినిమానే మంచి హిట్ కావడంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయని ఆమె తెలిపారు. అలాంటి పరిస్థితుల్లోనే తెలుగు సినిమా 'తలంబ్రాలు' కోసం ఎమ్మెస్ రెడ్డిగారు తనను తీసుకున్నారని, అదే సినిమాలో యాంటీ హీరోగా రాజశేఖర్ చేశారని జీవిత చెప్పారు. అయితే ఈ సినిమా కంటే ముందే తనకు రాజశేఖర్ తో పరిచయం ఉందని అన్నారు జీవిత.

ఈ మేరకు తమ సినీ జీవితంలో జరిగిన ఓ సంఘటన వివరించారు. ''ఒక తమిళ సినిమాలో రాజశేఖర్ హీరో అయితే నేను హీరోయిన్ గా చేస్తున్నా. మా ఇద్దరిపై కొన్నిరోజుల పాటు కొన్ని సన్నివేశాల షూటింగ్ జరిగింది. అయితే ఓ రోజు రాజశేఖర్ షూటింగుకి రాలేదు. ఏదో కారణం ఉండి ఉంటుంది అందుకే ఆయన షూటింగ్‌కి రాలేకపోయారని అనుకున్నా. కానీ అది వ్యక్తిగత కారణం కాదు.. హీరోయిన్‌ను మార్చేయమని ఆ సినిమా దర్శక నిర్మాతలతో రాజశేఖర్ చెప్పారని ఆ తర్వాత తెలిసింది. కాకపోతే చిరవకు వాళ్లు మార్చేసింది హీరోయిన్‌ని కాదులెండి ఆయననే. కొన్నేళ్ళకు రాజశేఖర్ ఈ విషయాన్ని నాతో చెప్పి తెగ నవ్వుకున్నారు'' అని తెలిపారు జీవిత.


Click it and Unblock the Notifications











