వాళ్లు సైకోలే, నేను క్లాసు రూములో సెక్స్ చూపొద్దని చెప్పా: జీవిత

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించిన మూవీ 'దొరసాని'. జులై 12న సినిమా విడుద‌ల‌ైంది. అయితే ఈ సినిమాకు చాలా వరకు యావరేజ్ రివ్యూలే వచ్చాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆనంద్ దేవరకొండపై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇటీవల ప్రెస్ మీట్లో ఇలాంటి వాటికి జీవిత తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో జీవిత ఓ సినిమాలో శృతిమించిన రొమాన్స్ ఉండటాన్ని తప్పుబడుతూ చేసిన కామెంట్లను తెరపైకి తెస్తూ... ఇపుడు నీ కూతురు రొమాన్స్ చేయడం లేదా? అంటూ విమర్శించిన వారి నోరు మూయించే ప్రయత్నం కూడా చేశారు.

శవాల మీద డబ్బు ఏరుకోవడమే

శవాల మీద డబ్బు ఏరుకోవడమే

మేము వచ్చి సినిమా గురించి మాట్లాడుతుంటే... నెపొటిజం అని, ఇండస్ట్రీలోకి వారి పిల్లలను తెచ్చుకుంటున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు. మా గురించి చెడుగా మాట్లాడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్లు రాస్తున్నాయి. దాని వల్ల చేసుకునే సొమ్ము శవాల మీద డబ్బులు ఏరుకోవడమే. దయచేసి అలా చేయొద్దు. ఎవరి గురించైనా ఒక కామెంట్ చేసేముందు, రాసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీలాగే మాకు ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకరిని హర్ట్ చేసే విధంగా రాయడం వల్ల మీకు ఏం వస్తుంది? అంటూ... జీవిత ప్రశ్నించారు.

మీ రివ్యూల వల్ల ఎబో యావరేజ్ సినిమా చచ్చిపోతోంది

మీ రివ్యూల వల్ల ఎబో యావరేజ్ సినిమా చచ్చిపోతోంది

సినిమా నిలదొక్కుకోవడానికి సమయం ఇవ్వకుండానే రివ్యూలు రాస్తున్నారు. దాని వల్ల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఏమైపోవాలి? రివ్యూలను ఎవరూ పట్టించుకోరు... సినిమా బావుంటే చూస్తారని కొందరు అంటున్నారు. కానీ మీ రివ్యూల వల్ల ఎబో యావరేజ్ మూవీ చచ్చిపోతుందనే విషయం గుర్తుంచాలని జీవిత సూచించారు.

అలాంటి వారు సైకోలే

అలాంటి వారు సైకోలే

దొరసాని మూవీకి మంచి టాక్ వచ్చింది. చాలా మంచి రివ్యూలు కూడా వచ్చాయి. ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఈ సినిమా కాకుంటే ఇంకో సినిమా. ఆనంద్‌ను సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేశారంటే వారు సైకోలు అయి ఉంటారు. ఎవరైనా ట్రూహార్ట్ ఓపెన్ మైండ్ తో దొరసాని చూస్తే అదో క్రేజీ మూవీ. నా కూతురు లేదా ఆనంద్ యాక్ట్ చేశాడని ఇలా చెప్పడం లేదు, ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఏ ఆలోచన రాలేదు. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.... అని జీవిత తెలిపారు.

క్లాస్ రూములో సెక్స్ చేస్తున్నట్లు చూపించడం పద్దతి కాదు అని చెప్పాను

క్లాస్ రూములో సెక్స్ చేస్తున్నట్లు చూపించడం పద్దతి కాదు అని చెప్పాను

నేను గతంలో డిగ్రీ కాలేజ్ అనే సినిమా ఫంక్షన్లో మాట్లాడింది పెద్ద ఇష్యూ చేశారు. నేను సినిమాలో లవ్ ఉండొద్దు, రొమాన్స్ ఉండొద్దు అని చెప్పలేదు. ఆ లవ్, రొమాన్స్ వల్గారిటీ లేకుండా, అసభ్యత లేకుండా చూపించాలని మాత్రమే చెప్పాను. క్లాస్ రూములో సెక్స్ చేస్తున్నట్లు చూపించడం పద్దతి కాదు అని చెప్పాను. ప్రేమ అనేది చాలా ప్యూర్.. ఆ ప్యూరిటీ ఎలా ఉంటుందో ‘దొరసాని'లో కనిపించిందని జీవిత చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X