Don't Miss!
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజశేఖర్ ఇంకా హాస్పిటల్లోనే.. జీవితకు కరోనా నెగెటివ్
యాంగ్రీ హీరో రాజశేఖర్ ఫ్యామిలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.. మధ్యలో శివాత్మిక వేసిన ట్వీట్ కాస్త గందరోగోళానికి దారి తీసింది. ఆమె వేసిన ట్వీట్‌తో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి. మళ్లీ మర్ ట్వీట్ వేసి నాన్న ఆరోగ్యం స్థిమితంగానే ఉందని, ఆందోళన చెందకండని చెప్పుకొచ్చింది.
మీరు చూపిస్తున్న ప్రేమకు మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. కానీ ఆయన పరిస్థితి మరీ అంత క్రిటికల్ కాదు. దయచేసి అది తెలుసుకోండి.. ఆరోగ్యం స్థిమితంగానే ఉంది.. మెరుగుపడుతూనే ఉంది. మీ అందరి ప్రార్థనలు మాకు కావాలి.. మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్స్. ఎవ్వరూ ఆందోళన చెందకండి.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండని శివాత్మిక కోరింది.
ఇక తాజాగా రాజశేఖర్ హెల్త్ బుల్లిటెన్ వచ్చింది. ఆరోగ్యం స్థిమితంగానే ఉందని వైద్యానికి స్పందిస్తున్నాడని తెలిపారు. అయితే మరో పక్క జీవిత మాత్రం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ప్రకటించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో జీవితకు కరోనా నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు. రాజశేఖర్ మాత్రం ఇంకొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.