»   » నాని 'జెండాపైకపిరాజు' విడుదల తేదీ ఖరారు

నాని 'జెండాపైకపిరాజు' విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

    హైదరాబాద్ :నాని, అమలాపాల్‌ జంటగా తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన చిత్రం 'జెండాపైకపిరాజు'. రాగిణి ద్వివేది కీలకపాత్ర పోషించింది. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, శివరామన్‌, రజిత్‌ పార్థసారధి నిర్మాతలు. ఈ చిత్రాన్నిఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ...ఈ దేశానికి ఏం చేయొద్దు. సొంత వూరుని బాగు చేయొద్దు. పనులన్నీ మానేసి పక్కవాడికి సేవ చేయొద్దు. నీకు నువ్వు బాగుపడు... చాలు. ఈ దేశం దానికదే బాగుపడుతుంది. మా కథలో ఇదే చెబుతున్నాం అంటున్నారు సముద్రఖని.

    Jenda Pai Kapiraju

    నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రతి వ్యక్తి తననితాను సంస్కరించుకొంటే దేశాన్ని సంస్కరించినట్టే. ఈ అంశం చుట్టూ నడిచే చిత్రమిది. నాని ద్విపాత్రాభినం చేశారు. రెండు పాత్రల్లోనూ ఆయన నటన ఆకట్టుకొంటుంది. శరత్‌కుమార్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. జీవి ప్రకాష్‌ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. నాని మొట్ట మొదటి సారిగా పూర్తి స్థాయిగా మాస్ పాత్ర పోషిస్తున్నాడు. "శంభో శివ శంభో'' చిత్రం తో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన సముద్రఖని ఈ సినిమాను తెర కెక్కించాడు. మల్టిడైమన్షన్ వారు మా ప్రాజెక్ట్ కు ఎంతో బలాన్ని ఇచ్చారు''అన్నారు.

    నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.

    వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కె. శ్రీనివాసన్ నిర్మిస్తున్న "జెండాపైకపిరాజు'' చిత్రాన్ని మల్టిడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నారు. శివబాలాజీ, తనికెళ్లభరణి, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రధారులు. .ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

    English summary
    Nani's upcoming Bi-lingual Film Jenda Pai Kapiraju got it's Official Release date for February 14th as an Valentines day special and this movie was releasing in both Tamil and Telugu at a Time and audio released recently and the Film starring Amala Paul, Ragini Dwivedi and Sarath Kumar in lead roles and Vennela Kishore in comedy role and flick directed by Samudra Khani and Music composed by GV Prakesh.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more