హాలీవుడ్ రీమేక్ గా ...మన సినిమా?

విశ్వసనీయ సమాచారం ప్రకారం లాస్ ఏంజిల్స్ బేసెడ్ ఇండియన్ రెస్టారెంట్ ఓనరైన సంజయ్ పటేల్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహించనున్నాడు. ధర్మేంద్ర ,రాజేష్ ఖన్నా,వహీదా రహమాన్ జంటగా 1969 లో వచ్చిన ఖామోషి చిత్రం ఆయనను అప్పట్లో బాగా ఆకట్టుకుంది. అందులో వహీదా ఓ మెంటల్ హాస్పటిల్ లో పనిచేసే నర్సుగా...ఇద్దరు పేషెంట్స్ తో ప్రేమలో పడే పాత్రగా కనిపిస్తుంది. దాంతో అప్పటినుండి ఆయనను ఆ సినిమా వెంటాడుతూనే ఉంది. మొదట హిందీలోనే రీమేక్ చేద్దామని అనుకున్నాడట. అయితే ఆ ప్రయత్న కార్యరూపం దాల్చలేదు.
దాంతో అసలు ఈ సినిమాను హాలీవుడ్ లో తీసి హిట్టు కొట్టి భారత ప్రతిభ చాటాలనుకున్నాడట. అందులోనూ Aniston రోజూ అతని రెస్టారెంట్ కి రావటంతో ఆమెను చూసినప్పుడల్లా ఆ పాత్రే గుర్తుకు రావటం జరిగేదట. దాంతో ఉండబట్టలేక ఆమెకు ఆ కథ చెప్పేసాడట. దాంతో ఆమె కూడా బాగా మూవ్ అయ్యి బౌండ్ స్క్రిప్ట్ అడిగిందిట.అప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ పైనే పనిచేస్తూ వస్తున్నాడట. దానికాయన 'సైలెన్స్' అని పేరు కూడా పెట్టాడట. హాలీవుడ్ పెద్ద స్టార్స్ ని ఈ సినిమా కోసం ఒప్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.
అలాగే కథ కూడా ఇప్పటి కాలానికి తగినట్లుగా యూనివర్సియల్ యాస్పెక్ట్ ఉండేటట్లు చూసుకుంటున్నాడట. అలాగే అన్నీ అనుకూలిస్తే వచ్చే సమ్మర్ కి సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇది కనుక వర్కవుట్ అయితే మన క్లాసిక్ సినిమా కథలు దేవదాసు,అనార్కలి వంటివి హాలీవుడ్ తెరకెక్కే అవకాశం ఉంది.కానీ అప్పుడు పాపం కాపీ రాయుళ్ళకే ఇబ్బంది.మన కథలే మళ్ళీ కాపీ కొట్టడం కష్టం కదా.


Click it and Unblock the Notifications











