పెద్ద హీరోను పట్టాడు: ‘జెర్సీ’ డైరెక్టర్‌ నెక్ట్స్ మూవీ ఎవరితో తెలుసా?

'జెర్సీ' మూవీ విడుదలైన తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు టాలీవుడ్లో మారుమ్రోగిపోతోంది. టాలీవుడ్లో ఇలాంటి మంచి సినిమా తీసే ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా అందరూ గౌతమ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

'జెర్సీ' సినిమా విడుదల ముందు జరిగిన ప్రెస్ మీట్లు, విడుదలైన తర్వాత జరుగుతున్న సక్సెస్ మీట్లలో హీరో నాని గౌతమ్ తిన్ననూరి టాలెంట్ గురించి వెల్లడిస్తూ... అతడు పెద్ద దర్శకుడు అవుతాడు అంటూ పొగడ్తలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అందుకుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ ఓ పెద్ద హీరోతో సినిమా ఓకే చేయించుకునే పనిలో ఉన్నారట.

యంగ్ టైగర్‌ను కలిసిన గౌతమ్

యంగ్ టైగర్‌ను కలిసిన గౌతమ్

గౌతమ్ తిన్ననూరి ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. జెర్సీ మూవీ విడుదలకు ముందే వీరి మీటింగ్ జరిగినట్లు టాక్. అతడి వద్ద ఉన్న కథను ఎన్టీఆర్‌కు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?

ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?

గౌతమ్ తిన్ననూరి చెప్పిన లైన్ విన్న ఎన్టీఆర్ తన సుముఖత వ్యక్తం చేశాడని, పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అఫీషియల్ అనౌన్స్ వస్తే తప్ప దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

రామ్ చరణ్‌ను కూడా కలవబోతున్నాడా?

రామ్ చరణ్‌ను కూడా కలవబోతున్నాడా?

ఈ వార్త మాత్రమే కాదు... గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్‌ను కూడా కలవబోతున్నట్లు, చాలా రోజుల క్రితం రాసుకున్న పీరియడ్ డ్రామాను అతడికి చెప్పబోతున్నట్లు ఓ రూమర్ వినిపిస్తోంది. కాలికి గాయం కావడం వల్ల ఇంటి వద్ద ఉన్న చరణ్‌తో ఎన్వీ ప్రసాద్ మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారట.

RRR షూట్లో చరణ్, ఎన్టీఆర్

RRR షూట్లో చరణ్, ఎన్టీఆర్

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్... రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘RRR' మూవీలో నటిస్తున్నారు. చరణ్‌కు గాయం కావడంతో షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ అంచనాతో నిర్మిస్తున్నారు. 2020లో ఈ మూవీ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X