మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన జెర్సీ దర్శకుడు.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రానున్న రోజుల్లో స్టార్ హీరోలు టాలెంటెడ్ దర్శకుల కాంబినేషన్స్ సెట్స్ పైకి రాబోతున్నట్లు రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. ఇక మెగా హీరోలు కూడా సరికొత్త స్క్రిప్ట్ లను ఎంచుకుంటు చాలా ఫాస్ట్ గా ముందుకు వెళుతున్నారు. అయితే ఇటీవల ఒక టాలెంటెడ్ దర్శకుడు ఇచ్చిన క్లారిటీతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

స్పీడ్ పెంచుతున్నాడు
మెగా హీరోల్లో రామ్ చరణ్ కూడా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో స్పీడ్ పెంచుతున్నాడు. RRR వంటి పాన్ ఇండియా సినిమా తరువాత పవర్ఫుల్ కథతో రావాలని చాలామంది దర్శకులతో చర్చలు జరిపిన చరణ్ మొత్తానికి శంకర్ తో తన 15వ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆలస్యమయినా కూడా
అయితే శంకర్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతకంటే ముందు ఈ దర్శకుడు కమల్ హాసన్ తో ఒక సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించిన గొడవలు దాదాపు పూర్తయ్యాయి. దీంతో శంకర్ ప్లాన్ మారింది. కానీ ఆలస్యమయినా కూడా తప్పకుండా వీరి కాంబోలో సినిమా మాత్రం ఉంటుందని దిల్ రాజు ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

షాక్ ఇచ్చిన దర్శకుడు
అయితే రామ్ చరణ్ 16వ సినిమా కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అని అనుకుంటున్న తరుణంలో ఒక దర్శకుడు అభిమానులకు షాక్ ఇచ్చాడు. జెర్సీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. నిర్మాత అల్లు అరవింద్ ఆ ప్రాజెక్టును లైన్ లో పెడుతున్నట్లు భారీ స్థాయిలో రూమర్స్ వచ్చాయి.
Recommended Video

ఇంకా ఫిక్స్ అవ్వలేదు
అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ గౌతమ్ ఎవరు ఊహించని విధంగా స్పందించాడు. ప్రస్తుతం తాను పూర్తిగా హిందీ జెర్సీ రీమేక్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నానని అంటూ ఇప్పటివరకు ఏ హీరోకు కథ చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యే వరకు తన నెక్స్ట్ సినిమాపై అప్పుడే ఒక నిర్ణయానికి రానని కూడా గౌతమ్ చెప్పడంతో రామ్ చరణ్ తో మూవీ ఫిక్స్ కాలేదని ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ దర్శకుడు నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











