రానా ఎవరో తెలియదు.. బాహుబలి రిలీజైందా? సుమకు షాకిచ్చిన జెర్సీ కుర్రాడు

Recommended Video

Jersey Child Artist Ronith Hilarious Punches On Suma | Jersey Success Meet || Filmibeat Telugu

నేచురల్ స్టార్ నానీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ చిత్రం ప్రేక్షకుల మన్ననలందుకొంటూ భారీ సక్సెస్ వైపు దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా సినిమా యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరుకాగా, చిత్రంలో నటించిన నటీనటులతోపాటు బాల నటుడిగా నటించిన రోనిత్ కమ్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదికపైకి పిలిచి రోనిత్‌ను మాట్లాడమని యాంకర్ సుమ కోరగా.. తుంటరి ప్రశ్నలతో ఆమెను ఆటపట్టించారు. దాంతో ఆడియెన్స్ నవ్వుల్లో మునిగిపోయారు.. ఇంతకు రోనిత్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

యాంకర్ సుమ ఎవరు?

యాంకర్ సుమ ఎవరు?

జెర్సీ థాంక్యూ మీట్ వేదికపై సుమ అడిగిన ప్రశ్నలకు రోనిత్ బుల్లి బ్లలి మాటలు నవ్వుల్లో ముంచెత్తాయి. నా గురించి తెలుసా అంటే నీవు ఎవరు అని ప్రశ్నించాడు. యాక్టర్ సుమ గురించి తెలుసా అంటే ఆమె ఎవరు అని అన్నారు. దాంతో స్వయంగా నేను యాంకర్ సుమ అని పరిచయం చేసుకొన్నది.

శ్రద్ధా శ్రీనాథ్ నా తల్లి కాదు

శ్రద్ధా శ్రీనాథ్ నా తల్లి కాదు

జెర్సీలో మదర్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ గురించి చెప్పమనగా.. ఆమె నా తల్లి కాదు.. నాకు తల్లి వేరే ఉంది. ఇక్కడే ఎక్కడో కూర్చున్నది అని అన్నారు. శ్రద్దా శ్రీనాథ్ చాలా మంచి కోఆపరేట్ చేశారు అని చెప్పారు అని సుమకు ఝలక్ ఇచ్చారు.

సెల్ఫీలు తీసుకొని... ముద్దులు పెట్టుకొన్నారు

సెల్ఫీలు తీసుకొని... ముద్దులు పెట్టుకొన్నారు

జెర్సీ సినిమాను థియేటర్లలో చూశాను. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఢిల్లీలో నాతో చాలా మంది సెల్ఫీ చాలా తీసుకొన్నారు. హైదరాబాద్‌లో అయితే నన్ను చాలా మంది ముద్దు పెట్టుకొన్నారు. సినిమా చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది అని రోనిత్ అన్నారు. అమ్మాయిలు ముద్దు పెట్టుకొన్నారా అంటే అబ్బాయిలు.. అమ్మాయిలు ఇద్దరు ముద్దు పెట్టుకొన్నారు అని చెప్పారు.

 రానా ఎవరు.. బాహుబలి రిలీజైందా?

రానా ఎవరు.. బాహుబలి రిలీజైందా?

హీరో రానాను కలిశారా? అని సుమ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎవరాయన.. రానా నాకు తెలియదు అని అన్నారు. బాహుబలిలో భళ్లాల దేవుడుగా నటించిన రానా దగ్గుబాటి తెలియదా అంటే తెలియదు. బాహుబలి చూడలేదు. బాహుబలి ఎప్పుడు రిలీజైంది అని అడిగాడు. బాహుబలిలోని కటప్ప జెర్సీలో కోచ్‌గా నటించాడని తెలిపారు. సత్యరాజ్ గురించి చెప్పమని అడుగగా.. నాకు తెలియదు.. నాని అన్నను అడుగు అని అన్నాడు.

సుమ నీకు పెళ్లి అయితే ఏంటీ

సుమ నీకు పెళ్లి అయితే ఏంటీ

చివరగా రోనిత్ కమ్రాను సుమ ముద్దు పెట్టుకొన్నది. ఆ తర్వాత నాకు పెళ్లి అయింది.. పిల్లలు కూడా ఉన్నారు అంటే.. అయితే నాకేంటి.. నేను ఏమి చేయాలి అని అన్నారు. అంతేకాకుండా దర్శకుడు గౌతమ్ మంచి వాడు. నన్ను బాగా చూసుకొన్నాడని చెప్పాడు. ఇలా బుల్లి బుల్లిగా రోనిత్ చెప్పిన మాటలకు నాని, రానా, శ్రద్దా, గౌతమ్ కడుపుబ్బ నవ్వారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X