నాని ‘జెర్సీ’ మూవీ ట్విట్టర్ రివ్యూ... టాక్ ఎలా ఉందంటే..?
Recommended Video
నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈచిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. క్రికెట్ నేపథ్యానికి ఒక అద్భుతమైన స్టోరీ జోడించి ఎమోషనల్ జర్నీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ వచ్చిందో ఓ లుక్కేద్దాం.

హార్ట్ వార్మింగ్ స్పోర్ట్స్ డ్రామా
జెర్సీ మూవీ హార్ట్ వార్మింగ్ స్పోర్ట్స్ డ్రామా. నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. సెకండాఫ్ కాస్త లాగినట్లు ఉంది కానీ క్లైమాక్స్ బావుంది. సినిమాలో చాలా టచ్చింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అనిరుధ్ టెర్రిఫిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

మనసుకు హత్తుకున్న సినిమా
మనసుకును హత్తుకునే సినిమా జెర్సీ. చాలా చాలా బావుంది. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ‘అమేజింగ్' మూవీ.

ఫస్టాఫ్ డీసెంటుగా ఉంది
జెర్సీ సినిమాపై చాలా మంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తొలి భాగం డీసెంటుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్
నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, గౌతమ్ స్టోరీ, డైరెక్షన్ సూపర్, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ అయింది. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు బావున్నాయి. ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన మూవీ. 3.25/5 రేటింగ్ ఇచ్చే స్థాయిలో ఉంది.

ఫీల్ గుడ్ బొమ్మ
సినిమాలో భావోద్వేగాలు హై రేంజిలో ఉన్నాయి. హీరో పెర్ఫార్మెన్స్ సూపర్. స్క్రీన్ ప్లే బావుంది. ఫీల్ గుడ్ బొమ్మ.

జెర్సీ బ్లాక్ బస్టర్
ఫస్టాఫ్ చిత్రీకరించిన తీరు బావుంది. నాని నటన నిరూపించే విధంగా సినిమా రూపొందించారు. సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంది. జెర్సీ బ్లాక్ బస్టర్ బొమ్మ.

ఫస్ట్ ఇన్నింగ్ అదిరింది
ఫస్ట్ ఇన్నింగ్ అదిరింది. బౌండరీస్ లేకపోయినా మంచిగా స్ట్రైక్ రొటేట్ చేశాడు దర్శకుడు
ఇంటర్వెల్ సమయానికి కథను పికప్ చేశారు
తొలిభాగం డీసెంట్‌గా ఉంది. స్లోగా మొదలైనా... ఇంటర్వెల్ సమయానికి కథను పికప్ చేశారు.
ఫస్ట్ టైమ్ అనుకుంటా..
ఫస్ట్ టైమ్ అనుకుంటా.. ఈ జనరేషన్ స్టార్ హీరోని ఒక 10 ఏళ్ల కుర్రాడు బిగ్ స్క్రీన్‌పై నాన్న అని పిలవడం.


Click it and Unblock the Notifications











