నాని ‘జెర్సీ’ మూవీపై భారీ హైప్... కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువే, ఎందుకిలా?
Recommended Video
టాలీవుడ్ ఇంటస్ట్రీలో నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని 2016, 2017 సంవత్సరాల్లో వరుస విజయాలతో హాట్రిక్స్ కొడుతూ దూసుకెళ్లాడు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' వరకు నాని జోరు కొనసాగింది. అయితే 2018లో నాని సినిమాల బిజినెస్ కాస్త డీలా పడింది.
గతేడాది నాగార్జునతో కలిసి నాని నటించి 'దేవదాస్' మూవీతో పాటు... సోలోగా చేసిన 'కృష్ణార్జున యుద్ధం' బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో కథల ఎంపికను సీరియస్‌గా తీసుకున్న నాని 'జెర్సీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

‘జెర్సీ' మూవీపై భారీ హైప్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘జెర్సీ' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇది ఐపీఎల్ సీజన్ కావడం, క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో పాటు ఈ మధ్య రిలీజైన ట్రైలర్ ఎఫెక్టుతో సినిమాపై భారీ హైప్ వచ్చింది.

కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువే
అయితే సినిమాపై ఇంత హైప్ ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ నాని గత సినిమాల కంటే తక్కువగా జరుగడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నాని నటించిన గత మూడు సినిమాలు తీసుకుంటే ‘జెర్సీ' కే ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువ జరుగడం గమనార్హం.

కారణం ఇదేనా?
నాని నటించిన గత 3 సినిమాల ప్రీ బిజినెస్ పరిశీలిస్తే... ‘మిడిల్ క్లాస్ అబ్బాయి' రూ. 29.90 కోట్లు, నాగార్జునతో కలిసి నటించిన దేవదాస్ రూ. 35.80 కోట్లు, కృష్ణార్జున యుద్ధం మూవీకి రూ. 27.30 కోట్ల బిజినెస్ జరిగింది. నాని నటించిన చివరి రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాక పోవడం వల్లే ‘జెర్సీ' ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువ అయినట్లు తెలుస్తోంది.

జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘జెర్సీ' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఏరియా వైజ్ రిలీజ్
ఏరియా వైజ్ పరిశీలిస్తే నైజా, ఉత్తరాంధ్ర కలిపి రూ. 10 కోట్లు, సీడెడ్ రూ. 3.20 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.60 కోట్లు, కృష్ణ రూ. 1.45 కోట్లు, గుంటూరు రూ. 1.80 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 1.25 కోట్లు, నెల్లూరు రూ. 80 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 1.90 కోట్లు, ఓవర్సీస్ రూ. 4 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

పూర్తి నమ్మకంతో ఉన్న నాని
ఈ సినిమా కచ్చితంగా హిట్. బ్లాక్ బస్టర్ అనే మాట సరిపోదేమో.. ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు అసలు పెట్టకూడదేమో అనిపిస్తుంది. అంతగొప్ప సినిమాలో చేశాననే సంతృప్తి, గర్వం ఉంది. ఏప్రిల్ 19న సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటారని నాని ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంటులో వ్యాఖ్యానించారు.

జెర్సీ
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జెర్సీ'. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











