అసత్య ప్రమాణ కేసులో బాలీవుడ్ హీరో..తేలితే ఏడేళ్లు

ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. 1999లో మాడల్ జెస్సికాలాల్ ఢిల్లీలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అసత్య ప్రమాణం కేసులో దోషిగా తేలితే గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది.
షయాన్ మున్షీ మొదట మోడల్ తర్వాత నటుడుగా టర్న్ తీసుకున్నారు. 2003 లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ఝూంకార్ బీట్స్ చిత్రంతో ఆయన తెరంగ్రేటం చేసారు. కలకత్తా నివాసి అయిన షయాన్ మున్షీ, విజి మరియు నటి అయిన పీయా రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు. షయాన్ మున్షీ తర్వాత మై బ్రదర్ నిఖిల్ వంటి చిత్రాల్లోనే కాక చాలా మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా చేసారు.


Click it and Unblock the Notifications











