ఝాన్సీగా జ్యోతిక సిద్ధం.. ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు..!
తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధంగా ఉంది అని మన్నందరికి తెలుసు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది.
కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా ఆగష్టు 3న ఈ చిత్ర విడుదలకు సిద్దమవుతున్నది. సంచలనాల దర్శకుడు బాల రూపొందించిన నాచియార్ చిత్రం తమిళనాడులో ఘన విజయం సాధించింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో జ్యోతిక నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. తెలుగులో ఝాన్సీ పేరుతో ఆగష్టు 3న విడుదలకు కానున్నది. ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్. జీవి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు.

ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ "నాచియార్ చిత్రం తమిళం లో ఘన విజయం సాధించింది. సన్సేషనల్ డైరెక్టర్ బాల స్వయ దర్శకత్వం నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు హక్కులు మాకు దక్కటం చాల సంతోషంగా ఉంది. బాల అద్భుతమైన దర్శకత్వం ఒక్క ఎత్తైతే జ్యోతిక నటన మరో ఎత్తు. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా తమిళనాడు అంతటా విజయవంతం గా ప్రదర్శింపబడింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు లో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఆగష్టు 3న విడుదల కు సిద్ధంగా ఉంది. తమిళంలో ఎంతో విజయం సాధించిన ఈ సినిమాపై తెలుగు లో అంచనాలు భారీగా ఉన్నాయి. బయర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి ఆఫర్ వస్తుంది. తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది" అని తెలిపారు.


Click it and Unblock the Notifications











