శ్రీదేవి కూతురు కోసం లైనేస్తున్నారు(ఫోటోలు)
హైదరాబాద్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని ఎప్పటి నుండో ఊహాగానాలు వినిపిస్తున్నా....ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే పలువురు నిర్మాతలు మాత్రం శ్రీదేవి కూతురు కోసం గత కొంతకాలంగా లైనేస్తూనే ఉన్నారు. లైనేయడం అంటే మరేదో కాదు....ఆమెతో సినిమా చేయాలనే ప్రయత్నమే.
శ్రీదేవి సౌతిండియాకు చెందిన వ్యక్తి కావడంతో...ఆమె కూతురుతో సినిమా చేయడానికి సౌతిండియా నిర్మాతలే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. సౌతిండియాలో స్టార్ కిడ్స్ అయిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్, నాగార్జున తనయుడు నాగ చైతన్య లాంటి వాళ్ల సరసన జాహ్నవిని హీరోయిన్‌గా పెట్టి సినిమాలు చేయాలనే ప్రయత్నం కొందరు నిర్మాతలు ఇప్పటికే చేసినట్లు తెలుస్తోంది.
అల్లు అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు జాహ్నవి తండ్రి బోనీ కపూర్‌ను ఈ విషయమై సంప్రదించినట్లు సమాచారం. అయితే శ్రీదేవి-బోనీ కపూర్ తమ కూతురును ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి పంపడం ఇష్టం లేదని తేల్చి చెప్పినట్ల తెలుస్తోంది. జాహ్నవికి సొంతగా నిర్ణయాలు తీసుకునే వయసొచ్చాక ఆమె ఇష్ట ప్రకారం సినీరంగంతో లేదా ఇతర ఏ రంగంలోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, జాహ్నవి చదువులు పూర్తయిన తర్వాత ఏదైనా అని స్పష్టం చేస్తున్నారట.
ఈ మధ్య జాహ్నవి తరచూ తల్లితో కలిసి పలు ఫ్యాషన్ షోలలో, వివిధ సినిమా ఫంక్షన్లలో పాల్గొనడం, తన సెక్సీ ఆటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె వ్యవహారం చూస్తుంటే.....మోడలింగ్, ఫ్యాషన్ రంగం, సినిమా రంగంలో ఏదో ఒక రంగాన్ని జాహ్నవి ఎంచుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

జాహ్నవి
సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) టోర్నీలో శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి తన హాట్ అప్పియరెన్స్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. శ్రీదేవిబోనీకపూర్ సిసిఎల్ బెంగాల్ టైగర్స్ టీం ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేరళ-బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్ జరుగా శ్రీదేవితో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు స్టేడియంలో సందడి చేసారు.

అందరి చూపులు ఆమెపైనే
ఆ మధ్య జరిగిన సీసీఎల్ టోర్నీలో జాహ్నం హాట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో చాలా మంది మ్యాచ్ చూడటం మానేసి ఆమెనే చూడటం మొదలు పెట్టారు. అంటే సినిమాల్లోకి రాక ముందు జాహ్నవి తన అందాలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

చిలిపి చేష్టలు
అతిలోక సుందరిలాంటి అందచందాలతో, చక్కని నటనతో, హాస్యరసం కూడా మేళవిస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే శ్రీదేవిని తలుచుకుంటే ఇప్పటికీ అభిమానుల మనసులు జివ్వు మంటాయి. శ్రీదేవి లక్షణాలు ఆమె కూతురు జాహ్నవికి కూడా అబ్బినట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడున్న ఫోటోలో జాహ్నవి చిలిపి చేష్టలు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది.

పార్టీలో..
ప్రముఖ హీరోయిన్ శ్రీదేవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రముఖ వ్యాపార వేత్త, సహారా సంస్థల అధినేత సుబ్రతో రాయ్ శ్రీదేవి పద్మశ్రీ అవార్డు గెలుపొందిన నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసారు. అప్పుడు జాహ్నవి ఇలా సెక్సీ లుక్‌తో పార్టీకి హాజరైంది.

కూతురు కాదు..సిస్టర్ అంటున్నారు
ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరైతే శ్రీదేవి జాన్వికి తల్లిలా లేదని, సిస్టర్‌లా ఉందని అంతా పొగిడేస్తున్నారట. దీంతో జాన్వి తెరంగ్రేటం చేయబోయే సినిమాలో వీలైతే ఆమెకు అక్క పాత్రలో కనిపిస్తానని సన్నిహితులతో అంటోందట శ్రీదేవి.


Click it and Unblock the Notifications











