శ్రీదేవి కూతురు జిమ్ ఫోటోలు: మీ గుండె ‘ధడక్’ అనడం ఖాయం!
Recommended Video

శ్రీదేవి కూతురు జాహ్నవి త్వరలో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ప్రస్తుతం జాహ్నవి 'ధడక్' అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోయిన్లకు అందం, ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. అందుకే జాహ్నవి క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతోంది. ముంబైలో సినీ స్టార్లు అంతా వెళ్లే ఓ ప్రముఖ ఫిట్‌నెస్ సెంటర్‌కు జాహ్నవి వెళ్లి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

అందంలో తల్లిపోలికే
జాహ్నవిని చూసిన వారంతా అందంలో ఆమెది తల్లిపోలికే అంటున్నారు. హీరోయిన్ శ్రీదేవి ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమను తన అందంతో ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. తల్లి అందాన్ని పునికి పుచ్చుకున్న జాహ్నవి... ఆమె నట వారసత్వాన్ని స్వీకరించి ముందుకు సాగుతోంది.

సినిమా రంగాన్నే కెరీర్‌గా
1997లో జన్మించిన జాహ్నవి కపూర్ ఇటీవలే తన గ్రాజ్యువేషన్ పూర్తి చేసుకుంది. తండ్రి నిర్మాత కావడం, తల్లి నటి కావడంతో తను కూడా సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది. మరి జాహ్నవి తల్లి పేరును ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.

జాహ్నవి-షాహిద్
‘ధడక్' సినిమా విషయానికొస్తే.... ఈ చిత్రం ద్వారా జాహ్నవి కపూర్‌తో పాటు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

సైరాట్ రీమేక్
ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాత. మరాఠీ హిట్ మూవీ ‘సైరాట్' చిత్రానికి ఇది రీమేక్.

2018లో...
‘ధడక్' మూవీ జులై 6, 2018లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జాహ్నవి తొలి సినిమా విషయంలో రిస్క్ చేయకుండా ఆల్రెడీ హిట్టయిన సినిమానే ఎంచుకున్నారు. మరి జాహ్నవి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండబోతోందో చూడాలి.
జిమ్‌లో ఫన్ మూమెంట్స్
జిమ్‌లో జాహ్నవి కపూర్ ఫన్ మూమెంట్స్.


Click it and Unblock the Notifications











