రాఘవేంద్రరావు అంకుల్ వల్లే...లక్ష్మీ ప్రసన్న
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంకుల్ కృషివల్లే ఇంత పెద్ద విజయం సాధ్యమైందంటూ మురిసిపోతోంది మంచు లక్ష్మీ ప్రసన్న. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఆమె నిర్మించిన చిత్రం 'ఝుమ్మంది నాదం' గురువారంతో యాభై రోజులు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ..."మనోజ్ కెరీర్‌లోనే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రమిది. ముప్పై కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకొంది. సంగీతం, సాహిత్యం పరంగా చక్కటి ప్రశంసలు దక్కాయి. రాఘవేంద్రరావు అంకుల్ తనదైన శైలిలో ఒక దృశ్యకావ్యంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. తాప్సీ గ్లామర్ కూడా మా చిత్రానికి తోడయ్యింది. తను ఈ సినిమాతోనే పరిచయమైంది. ఇప్పుడు పలు చిత్రాలతో బిజీ హీరోయిన్ గా మారింది. చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించిన కీరవాణికి, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు" అంది. ఇక మంచు మనోజ్, తాప్సీ జంటగా నటించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











